Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని (Vanguru Mandal) కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి (Kondareddipalli infrastructure) ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గురువారం కొండారెడ్డిపల్లి గ్రామ గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు, గ్రామ ప్రజలతో కలెక్టర్ గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా గ్రామ సభ నిర్వహించి, అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం(Gram Sabha Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
Also Read: Baba Vanga: వినాశనం తప్పదా.. త్వరలో భూమ్మీదకు ఏలియన్స్.. బయటకొచ్చిన వణుకుపుట్టించే నిజాలు?
అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి (Village Development) పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా, రోడ్ల విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు (Ration card distribution), ఇందిరమ్మ ఇల్లు (Indiramma Housing) వంటి కీలకమైన సంక్షేమ పథకాలను (Telangana Welfare Schemes) ప్రజలకు అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Also Read: Viral Video: ఎవడ్రా వీడు.. ఆయిల్ ప్యాకెట్ కట్ చేయకుండా, నూనెలో కరిగించి బజ్జీలు.. వీడియో వైరల్
అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని తెలుసుకున్న కలెక్టర్
కలెక్టర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని తెలుసుకున్నారు. గ్రామస్థుల అవసరాలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పైనా సమీక్ష జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు అన్ని పథకాల లబ్ధి కలగాలి, ఎవ్వరూ మిగిలిపోకూడదని కలెక్టర్ స్పష్టంగా సూచించారు. అర్హులకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి ముఖ్యమైన పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన వేగంగా జరిపి, అర్హులైన వారికి త్వరగా లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Urea Supply: లోటు యూరియాను ఆగస్టు నెలతో కలిసి సరఫరాచేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డిఆర్డిఏ చిన్న ఓబులేసు, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, డిపిఓ శ్రీరాములు, పంచాయతీరాజ్ ఈఈ విజయ్, మిషన్ భగీరథ (Mission Bhagiratha),ఈఈ సుధాకర్ సింగ్, జిల్లా స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
