Viral Video (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Video: ఎవడ్రా వీడు.. ఆయిల్ ప్యాకెట్ కట్ చేయకుండా, నూనెలో కరిగించి బజ్జీలు.. వీడియో వైరల్

Viral Video: సాధారణంగా చాలామందికి సాయంత్రం వేళ చిరుతిండ్లు తినే అలవాటు ఉంటుంది. అందుకే ఈవినింగ్ (Evening) సమయాల్లో రోడ్డు పక్కన దొరికే పునుగులు, బజ్జీలు, బోండాలు, పానిపూరీ, స్నాక్స్ వంటివి ఆరగిస్తుంటారు. అవి అనారోగ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ఖాతరు చేయకుండా తింటుంటారు. దీని వల్ల దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడి.. ఆస్పత్రుల్లో వేల రూపాయలు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే బయటి ఫుడ్ ఎంత ప్రమాదకరమో తెలియజెప్పే మరో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులోని వ్యక్తి నూనె కడాయిలో బజ్జీలు వేయించే విధానం చూస్తే.. మీ కడుపులో తిప్పడం ఖాయం. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? దీనిపై నెటిజన్ల రియాక్షన్ ఏంటీ? ఇప్పుడు చూద్దాం.

వీడియో ఏముంది?
పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి.. వీధి పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. అతడు నూనెలో బ్రెడ్ తో బజ్జీలు వేస్తుండగా.. స్థానికుడు ఒకడు తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను గమనిస్తే.. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి వేడి వేడి కడాయిలో నూనె ప్యాకెట్లను ముంచాడు. ఆ వేడికి నూనె ప్యాకెట్లు మైనంలా కరిగిపోయి.. అందులోని ప్లాస్టిక్ సైతం నూనెలో కలిసిపోవడాన్ని చూడవచ్చు. అనంతరం ఆ నూనెలోనే బ్రెడ్ బజ్జీలు వేయిస్తూ వ్యాపారి కనిపించాడు. అయితే ఆ బజ్జీలను తినేందుకు స్థానికులు లొట్టలేసుకుంటూ ఎదురు చూడటం.. ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు కడాయిలోని నూనె బ్లాక్ కలర్ లో ఎంతో ప్రమాదకరంగా మారినప్పటికీ ఏమాత్రం పట్టనట్లు ప్రజలు భుజిస్తుండటం షాక్ కు గురిచేస్తోంది.

నెటిజన్ల రియాక్షన్ ఇదే..
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి.. బ్రెడ్ బజ్జీలు వేయిస్తున్న వీడియోను చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్లాస్టిక్ నూనెలో వేయించిన ఈ నూనె తింటే.. పాడెక్కాల్సిందేనని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు స్ట్రీట్ ఫుడ్ ఎదురుగానే మెడికల్ షాపు ఉండటాన్ని కూడా హైలెట్ చేస్తున్నారు. మెడికల్ షాపువాడితో ఒప్పందం చేసుకొని మరి.. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నావా? అంటూ ఫుడ్ వ్యాపారిని ప్రశ్నిస్తున్నారు. ‘మెుదటి బైట్ స్వర్గానికి తీసుకెళ్తుంది.. రెండో బైట్ పర్మినెంట్ గా అక్కడే ఉండేలా చేస్తుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇకపై స్ట్రీట్ ఫుడ్ తినేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తింటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. లేదంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లేనని నెట్టింట హెచ్చరిస్తున్నారు. ఒకవేళ సాయంత్రం వేళ మరి ఆకలిగా అనిపిస్తే.. రూ.10 పెట్టి రెండు అరటిపండ్లు తినాలని హితవు పలుకుతున్నారు.

Also Read: Rakhi Gift for PM Modi: ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్ మహిళ.. అది కూడా ‘ఓం’ చిహ్నంతో..!

అలాంటి ఫుడ్ తింటే జరిగేదిదే?
శుచి శుభ్రత పాటించని స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యం తప్పదు. ఎంతో ప్రమాదకరమైన బ్యాక్టీరియా (సాల్మొనెల్లా, ఈ.కోలై), వైరస్‌లు లేదా పరాన్నజీవులు శరీరంలోకి చేరి వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాల బారిన పడేలా చేస్తాయి. అపరిశుభ్రమైన ఆహారం కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను కలిగిస్తుంది. హెపటైటిస్ A, టైఫాయిడ్ వంటి వ్యాధులు అపరిశుభ్రమైన నీరు లేదా ఆహారం ద్వారానే అధికంగా వ్యాపిస్తాయి. నాణ్యత లేని పదార్థాలు లేదా అధిక నూనె, మసాలాల వాడకం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కలుషిత ఆహారంలో ఉండే రసాయనాలు లేదా సూక్ష్మక్రిములు కాలేయం, మూత్రపిండాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు. కాబట్టి స్ట్రీట్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read This: No Helmet No Petrol: బిగ్ అలర్ట్.. కొత్త రూల్స్ వచ్చేశాయ్.. హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్!

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?