Komati-Reddy (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Komati Reddy: జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కేసీఆర్‌పై పంచ్‌లు

Komati Reddy:

జూబ్లీహిల్స్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌస్‌‌లోకి వెళ్లి బయటకు రారు, అలాంటిది అధికారంలోకి ఎలా వస్తారంటూ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి (Komati Reddy) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెండేళ్లలో కేసీఆర్ అధికారంలోకి వస్తారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ఈ విధంగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి ఈ విధంగా వ్యంగ్యంగా తిప్పికొట్టారు. కేటీఆర్ చెబుతున్నట్టు రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం మారడం జరిగేపనికాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ మూడు సంవత్సరాలే కాదని, రాబోయే ఐదేళ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Read Also- GHMC: జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లపై తీవ్ర విమర్శలు.. ఏం చేయడంలేదో తెలుసా?

జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. పేరుకే జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలే నివసిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రజలు అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పేదల మేలు కోరే కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. ప్రజలు, బుద్ధిజీవులు, మేధావులు ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన రహ్మత్ నగర్ డివిజన్, పీజేఆర్ టెంపుల్ వద్ద మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాలు నాయక్, వేముల వీరేశం, పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

Read Also- Home Remedies: చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్

కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం పూర్తి చేశారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మరో పెద్ద ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. కమీషన్ల కోసం బీఆర్ఎస్ వాళ్లు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు. కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం పూర్తి చేశారు, కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేవారు. బీఆర్ఎస్ అవినీతి కారణంగా ఎస్ఎల్‌బీసీ లాంటి మిగతా ప్రాజెక్టులు ఆగిపోయాయని మండిపడ్డారు.

Just In

01

Wife Shocking Plot: కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది.. దర్యాప్తులో నమ్మలేని నిజాలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tandur Protest: తాండూర్‌లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?

Baahubali rocket: ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు.. తెలుగు ప్రజల గౌరవం..