Crime News: జనగామ జిల్లాలో బైక్‌లు(Bike), మోటారు వాహానాల దొంగతనానికి పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను జనగామ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు జనగామ ఏసీపీ పండర చేతన్ నితిన్(ACP Pandhar Chetan Nithin) దొంగల ముఠా వివరాలను సోమవారం వెల్లడించారు. ఎసీపీ కథనం ప్రకారం గంజాయి, మద్యం జల్సా లకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్న సూర్యాపేట(Suryapeta) జిల్లా కు చెందిన చెవుల మనోజ్(manoj), గొర్ల శివారెడ్డి(Shivareddy), ఆరే విజయ్(Vijay), వీరబోయిన భరత్(Bharath) నలుగురు ముఠాగా ఏర్పడ్డారని అన్నారు. జనగామ పట్టణంలోని సూర్యాపేట రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు విచారించగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారని తెలిపారు.
వీరిపైన హత్య కేసులు కూడా..
బైక్ దొంగతనాలు చేస్తూ హైదరాబాద్‌లో వాహానాలు అమ్ముతూ సొమ్ముచేసుకుని గంజాయి సేవించడం, జల్సాలు చేయడం చేస్తున్నారని అన్నారు. ఈ నలుగులు ముఠా సభ్యులు గతంలో అనేక నేరాల్లో ఉన్నారని, జైలుకు వెళ్ళి వచ్చారని అన్నారు. వీరిపైన హత్య కేసులు కూడా ఉన్నాయని ఏసీపీ వివరించారు. రాత్రి వేళల్లో రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలను దొంగిలిస్తున్నారని అన్నారు. వీరి వద్ద నుండి తొమ్మిది లక్షల 50 వేల విలువగల ఒక కారు, రెండు బైకులు, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి పండరి చేతన్ నితిన్ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిఐ సత్యనారాయణ రెడ్డి(CI Satyanarayana Reddy), ఎస్ఐ భరత్, కానిస్టేబులను ఎసిపి పండరి చేతన్ నితిన్ అభినందించారు.
Also Read: Dude movie ott: ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా!.. ఎక్కడంటే?
పరకాలలో దొంగల ముఠా హల్చల్..
హనుమకొండ జిల్లా పరకాల లో దొంగల ముఠా హల్చల్ చేసింది. దొంగతనాల కోసం పరకాల పట్టణంలో రెక్కీ నిర్వహిస్తున్న ముఠా కార్యకలాపాలను పోలీసులు ముందుగాానే పసిగట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో 8 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు,ముగ్గురు చిన్న పిల్లలున్నట్టు సమాచారం. ముఠా కార్యకలాపాలను గుర్తించిన స్థానికులు ఇచ్చిన సమాచారం తో అప్రమత్తం అయిన పోలీసులు వారి కదలికలు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారి ప్లాన్ కు చెక్కు పెట్టినట్టు అయ్యింది. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడంతోపాటు అనుమానితుల సంచారం పోలీసులకు ఇవ్వాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. సంచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
Also Read: Land Auction: ప్రారంభ ధర ఎకరం రూ.99 కోట్లు.. హైదరాబాద్‌లో మరోసారి భూవేలానికి వేళాయె!
