Kalvakuntla Kavitha: కేసీఆర్, హరీశ్ రావుపై కవిత షాకింగ్ కామెంట్స్!
Kalvakuntla Kavitha (Image Source: Twitter)
Telangana News

Kalvakuntla Kavitha: మళ్లీ ఓపెన్ అయిన కవిత.. కేసీఆర్, హరీశ్ రావుపై షాకింగ్ కామెంట్స్!

Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత మరోమారు ఆసక్తికర కామెంట్స్ చేశారు. బంజరాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో పలు విషయలు పంచుకున్నారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపైనా కవిత మాట్లాడారు. నూతన పార్టీని స్థాపించి విషయమై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కవిత క్లారిటీ ఇచ్చారు. పార్టీ పెట్టేముందు తన తండ్రి కేసీఆర్.. వందల మందితో చర్చలు జరిపారని.. ప్రస్తుతం తానూ అదే చేస్తున్నానని కవిత అన్నారు.

‘మెుదటి కూతుర్ని నేనే’
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడంపై కవిత ఆసక్తికరంగా స్పందించారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయి‌న మెదటి కూతుర్ని నేనే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ‘ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశాను. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం కేసీఆర్ దేనని హరీశ్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారు. హరీశ్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప నాకు వేరే కోపం లేదు’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌లో చేరను: కవిత
త్వరలో కవిత కాంగ్రెస్ చేరబోతున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపైనా ఆమె స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. నేను కాంగ్రెస్ లో ఎవర్నీ అప్రోచ్ కాలేదు. సీఎం రేవంత్.. పదే పదే నాపేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో?’ అంటూ కవిత పేర్కొన్నారు.

‘బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు’
ప్రస్తుతం బీసీ సమస్యలపైనే కవిత పోరాతుండటంతో ఆమె ఒక వర్గానికే పరిమితం అవుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా తాజా చిట్ చాట్ లో కవిత క్లారిటీ ఇచ్చారు. ‘ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం పనిచేయాలనుకుంటున్నా. బీసీల సమస్య నా మనస్సుకు దగ్గరగా అనిపించింది. ప్రస్తుతం నేను ఫ్రీ బర్డ్.. నా ద్వారాలు తెరిచే ఉన్నాయి. చాలా మంది వచ్చి నన్ను కలుస్తున్నారు. నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దది. పార్టీ పెడితే ఎవరు పట్టించుకోరు. తొక్కుకుంటూ పోతేనే దారి ఏర్పడుతుంది’ అని కవిత చెప్పుకొచ్చారు.

Also Read: H-1B visa: ట్రంప్ మరో బాంబ్.. హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లు.. భారత్‌పై ప్రభావమెంత?

ఏపీతో నీటి వివాదంపై..
అంతకుముందు ఏపీతో ఉన్న జల వివాదంపైనా కవిత స్పందించారు. తెలంగాణలోని సగం జిల్లాలకు కృష్ణనది ప్రాణాధారంగా ఉందని అన్నారు. ‘గోదావరి నీళ్లను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అప్పగించారు. ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్య నాధ్ దాస్ ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి’ అని అన్నారు. మరోవైపు బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. లేకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Also Read: Huzurabad: అంగన్‌వాడీ గుడ్లతో.. మందుబాబులకు స్నాక్స్.. వామ్మో ఇలా ఉన్నారేంట్రా!

Just In

01

Jagga Reddy: మోదీ ఇచ్చిన హామీలపై నీకు నోరు రాదా.. కిషన్ రెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్..!

Apni Haddse: ‘అప్నీ హద్ సే’ టైటిల్ సాంగ్ విడుదల చేసిన జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్..

Tyler Chase: బెగ్గర్‌గా మారిన హాలీవుడ్ చైల్డ్ యాక్టర్ టైలర్ చేజ్.. ఎందుకంటే?

Railway Stocks: కీలక ట్రిగర్స్‌తో రైల్వే షేర్లలో దూకుడు.. IRCTC, RailTel, Jupiter Wagons 12% వరకు లాభాలు

Telangana Temples: ఆలయంలో ఇదేం తంతు.. పూజలు, టోకెన్ అంటూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న వైనం..!