Gandhi Jayanti: జాతి పిత మహాత్మగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా మాంస విక్రయాలు, స్లాటర్ హౌజ్ లు, వైన్ షాపులు, బార్ లు వంటివి మూసివేస్తుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజునే దసరా పండుగ రావటంతో పరిస్థితి విచిత్రంగా మారింది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన విజయ దశమి రోజున ప్రతి ఒక్కరూ పండుగ చేసుకుంటూ తమకు నచ్చిన శాఖాహార, మాంసాహార వంటలు చేసుకుంటారు.
Also Read: Ramchander Rao: ఫీజు రీయింబర్స్ మెంట్ పై సర్కార్ కు స్పష్టత కొరవడింది.. రాంచందర్ రావు సంచల కామెంట్స్
జీహెచ్ఎంసీ అధికారులు తర్జనభర్జన
జీహెచ్ఎంసీ కూడా గాంధీ జయంతి రోజున సిటీలో మొత్తం మటన్, చికెన్ దుకాణాలు, చెంగిచెర్లలోని స్లాటర్ హౌజ్ లను మూసివేస్తున్నట్లు ముందే ప్రకటిస్తుంది. తమ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో ఎలా అమలవుతున్నాయన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఈ సారి గాంధీ జయంతి రోజునే దసరా పండుగ రావటంతో ఏం చేయాలో తెలియక జీహెచ్ఎంసీ అధికారులు తర్జనభర్జన చేస్తున్నట్లు తెలిసింది. ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలన్న అధికారులు ఆ రోజు జంత వధ మటన్, చికెన్ విక్రయాలను ఎలా ఆపగలమన్న ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది.
చికెన్, మద్యం విక్రయాలను మూసి వేస్తారా?
తాము ఎంత కట్టడి చేసినా, రహస్యంగా జంతు వధ, మాంస విక్రయాలు జరిగే అవకాశాలున్నందున, జాతి పితకు నివాళిగా జంతు వధ, మటన్, చికెన్, మద్యం విక్రయాలను ఎలా అడ్డుకోవచ్చునన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గాంధీ జయంతి రోజున దసరా పండుగ రావటంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా మటన్, చికెన్, మద్యం విక్రయాలను మూసి వేస్తారా? లేక తెరిచే ఉంచుతారా? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కానీ సర్కారు నుంచి గానీ, జీహెచ్ఎంసీ, ఎక్సైజ్ అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలేమీ రాలేదు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే మటన్, చికెన్, మద్యం విక్రయాలకు సంబంధించి వచ్చే నెల 2వ తేదీన మూసివేత ఆదేశాలు రొటీన్ గానే వస్తాయా? లేక ఏమైనా మినహాయింపునిస్తారా? అన్నది వేచి చూడాలి.
Also Read: Handshake controversy: అతడిని తొలగించండి.. భారత్‌తో మ్యాచ్‌పై ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు