Virat Century: విరాట్ విధ్వంసం.. సచిన్ సెంచరీల రికార్డ్ బద్ధలు
Virat-Century (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Virat Century: రాంచీ వన్డేలో విరాట్ విధ్వంసం.. సచిన్ సెంచరీల రికార్డ్ కనుమరుగు

Virat Century: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) విజృంభించాడు. రాంచీ వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (india Vs South Africa) మధ్య తొలి వన్డేలో జూలు విదిల్చాడు. తన వన్డే కెరీర్‌లో రికార్డు స్థాయిలో 52వ వన్డే శతకాన్ని (Virat Century) నమోదు చేశాడు. థర్డ్-మ్యాన్ దిశగా బౌండరీ కొట్టి ఈ మైలురాయిని చేరుకున్నాడు. దీంతో, రాంచీ స్టేడియం ప్రేక్షకుల అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. అభిమానుల కేకలు, హర్షాతిరేకాలు, డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులు, కోచింగ్ సిబ్బంది చప్పట్లు కొట్టి అభినందించారు. కాగా, 100 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో సచిన్ 51 సెంచరీలు సాధించగా, రాంచీ శతకంతో కలుపుకొని విరాట్ కోహ్లీ మొత్తం సెంచరీలు 52కి చేరాయి. దీంతో, సచిన్‌ రికార్డును విరాట్ బద్దలుకొట్టేశాడు. రాంచీ వన్డేలో కోహ్లీ మొత్తం 120 బంతులు ఎదుర్కొని 135 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. చివరికి నండ్రే బర్గర్ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Read Also- Sharib Hashmi: క్యాన్సర్‌తో పోరాడిన భార్య.. ‘ఫ్యామిలీ మాన్’ JK నిజ జీవిత కథ తెలిస్తే ఎవరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే!

దీంతో, ఒకే ఫార్మాట్‌లో (వన్డే) అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. మరోవైపు, దక్షిణాఫ్రికాపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా కూడా విరాట్ అవతరించాడు. సఫారీ జట్టుపై తాజా సెంచరీతో కలుపుకొని మొత్తం 6 శతకాలు బాదాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ చెరో 5 సెంచరీలతో రెండవ స్థానానికి పడిపోయారు. మరోవైపు, ఒకే భారత మైదానంలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాటర్‌గానూ రాంచీలో కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. రాంచీలో మొత్తం 5 వన్డేలు ఆడిన విరాట్.. ఏకంగా 3 సెంచరీలు కొట్టాడు. ఇక, రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్, వడోదర మైదానంలో ఏడు వన్డేలు ఆడి 3 సెంచరీలు నమోదు చేశాడు. విశాఖపట్నంలో 7 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లీ 3 సెంచరీలు సాధించాడు. ఇక, పుణే స్టేడియంలో 8 వన్డేలు ఆడి కోహ్లీ 3 శతకాసాలు సాధించాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విరాట్ కోహ్లీ సెంచరీతో పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో 7000వ వ్యక్తిగత సెంచరీ నమోదయింది.

Read Also- Kondagattu Fire Accident: కొండగట్టు అగ్నిప్రమాదంపై కేటీఆర్ స్పందన… ప్రభుత్వానికి డిమాండ్ ఇదే

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!