Kondagattu Fire Accident: అగ్నిప్రమాదంపై కేటీఆర్ డిమాండ్లు ఇవే
KTR-On-Fire-Accident (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Kondagattu Fire Accident: కొండగట్టు అగ్నిప్రమాదంపై కేటీఆర్ స్పందన… ప్రభుత్వానికి డిమాండ్ ఇదే

Kondagattu Fire Accident: కొండగట్టులో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం (Kondagattu Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో స్థానిక అభయ హనుమాన్‌ విగ్రహం నుంచి కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారి మధ్య సుమారుగా 32 బొమ్మల దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఈ దుర్ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంత భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగిందని ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఒక్కో బాధిత కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్నిప్రమాద ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలపై అడిగి తెలుసుకున్నారు.

సకాలంలో ఫైరింజన్లు రాలేదు

సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడమే ఆస్తి నష్టం ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణమని కేటీఆర్ విమర్శించారు. జగిత్యాల ఫైర్ ఇంజన్ రిపేర్‌లో ఉండటం, వచ్చిన ఒక ఇంజన్ పని చేయకపోవడం, గంట తర్వాత కోరుట్ల, కరీంనగర్ నుంచి వాహనాలు రావడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ఈ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. జరిగిన ఆస్తి నష్టం, పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారాలు, దుకాణాలు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని, మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Read Also- Alleti Maheshwar Reddy: హెచ్ఐఎల్‌టీ పై సాక్ష్యాధారాలతో నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రవిశంకర్‌కు అభినందనలు

ప్రమాదం విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యల్లో పాల్గొని, బాధితులకు తక్షణ సాయంగా రూ. 5000 అందజేసిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కేటీఆర్ అభినందించారు. స్థానికులకు, నష్టపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకుంటే, పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఉపాధి కోసం అప్పులు చేసి, ఎంతో కష్టపడి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో ఉన్న సరుకు, బొమ్మలు, ఇతర సామాగ్రి సర్వం అగ్నికి ఆహుతయ్యాయని, దాదాపు 30 కుటుంబాల భవిష్యత్తు నాశనం అయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

Read Also- Lenskart B: లెన్‌స్కార్ట్ నుంచి సరికొత్త కళ్లజోళ్లు.. యూపీఐ పేమెంట్స్, ఫొటోలు, వీడియోల చిత్రీకరణతో పాటు ఎన్నో ఫీచర్లు

 

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!