Sharib Hashmi: క్యాన్సర్‌తో పోరాడిన JK భార్య..
Sharib Hashmi ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Sharib Hashmi: క్యాన్సర్‌తో పోరాడిన భార్య.. ‘ఫ్యామిలీ మాన్’ JK నిజ జీవిత కథ తెలిస్తే ఎవరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే!

Sharib Hashmi: హిందీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో తనదైన ముద్ర వేసుకున్న నటుల్లో షరీబ్ హష్మి (Sharib Hashmi) ఒకరు. నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు.. ఇలా పలు రంగాల్లో అడుగుపెట్టి, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లో జేకే తల్పాడే పాత్రతో ఆయన గుర్తింపు మరింత పెరిగింది.

‘ది ఫ్యామిలీ మ్యాన్’తో కెరీర్ టర్నింగ్ పాయింట్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2019–2021 మధ్య ప్రసారమైన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో జైవంత్ కాశీనాథ్ “జేకే” తల్పాడేగా నటించిన షరీబ్, తన సహజ అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. మనోజ్ బాజ్‌పాయితో ఆయన స్క్రీన్‌పై కనిపించిన స్నేహం, హాస్యం, కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ పాత్రకు గాను ఫిల్మ్‌ఫేర్ OTT సహా అనేక అవార్డులు అందుకోవడం ఆయన కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చింది. ఈ సిరీస్ తర్వాత ఆయనకు కొత్త పాత్రల అవకాశాలు వరుసగా వచ్చాయి.

షరీబ్ మొదట MTVలో రచయితగా కెరీర్ ప్రారంభించి, తరువాత నటన వైపు దృష్టి మార్చారు. చిన్న పాత్రలతో ప్రారంభించి, తర్వాత సహాయ నటుడిగా బలమైన గుర్తింపును సంపాదించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008), జబ్ తక్ హై జాన్ (2012), ఫిల్మిస్తాన్ (2012) వంటి సినిమాలలో ఆయన ముఖ్య సహాయ పాత్రలు పోషించారు. ఫిల్మిస్తాన్ కోసం ఉత్తమ హాస్య పాత్రకు IIFA అవార్డుకు నామినేషన్ కూడా దక్కింది. అలాగే అసుర్, స్కామ్ 1992, విక్రమ్ వేద, మిషన్ మజ్ను, జరా హట్కే జరా బచ్కే, తర్ల వంటి ప్రాజెక్ట్‌లలో ఆయన నటనను ప్రేక్షకులు మెచ్చుకున్నారు.

‘ఫ్యామిలీ మాన్’ JK నిజ జీవిత కథ

నస్రీన్ హష్మి కేవలం షరీబ్ హష్మి భార్య మాత్రమే కాదు. ఆమె జీవితంలోని అనేక బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, కుటుంబం కోసం ఎంతో కృషి చేసింది. అలాగే క్యాన్సర్ తో పోరాడి ఎన్నో పెద్ద సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంది. ఇంత కష్టపడి కూడా ఆశతో ముందుకు సాగి, తన కుటుంబాన్ని నిలబెట్టిన ఆమె నిజంగా బలమైన, ప్రేరణాత్మక మహిళగా చెప్పాలి. షరీబ్ యాక్టర్ గానే కాకుండా తెలుగు పాటలు కూడా బాగా పాడతాడు. ఇతను ఎంత బాగా పాడతాడు అంటే తెలుగు ఇంత బాగా వచ్చా అని మీరు కూడా షాక్ అవుతారు.

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!