Virat-Kohli (Image source Twitter)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Virat Kohli: ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు ఆసక్తికర పరిణామం.. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు

Virat Kohli: టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చాలా గ్యాప్ తర్వాత తొలిసారి, ఆదివారం (అక్టోబర్ 19) పెర్త్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. మొత్తం 8 బంతులు ఎదుర్కొని, కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్‌గా వెనుతిరిగి, అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు. బ్యాటింగ్‌ విషయంలో ఆకట్టుకోలేకపోయిన కోహ్లీ, మ్యాచ్ ప్రారంభానికి ముందు, తనకంటే జూనియర్ క్రికెటర్లు అయిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లను గౌరవించిన విధానంలో అందరి మెప్పు పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో క్లిప్‌లో జాతీయ గీతాలాపన కోసం భారత జట్టు మైదానంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతోంది. మైదానంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో విరాట్ కోహ్లీ అందరికంటే ముందు ఉండగా, తన వెనుక కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నడుచుకుంటూ వస్తున్నారు. అయితే, కోహ్లీ తాను ఆగిపోయి.. కెప్టెన్ శుభమన్ గిల్‌, వైస్ కెప్టెన్ అయ్యర్‌ ఇద్దరూ తనకంటే ముందు నడిచేలా సంజ్ఞ చేశారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత కోహ్లీ వారిని అనుసరించాడు. కోహ్లీ చేసిన ఈ నిరాడంబరమైన చర్య పట్ల అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు. ఒక అభిమాని స్పందిస్తూ, ‘గౌరవంగా నడుచుకునే వ్యక్తి అందరి గౌరవాన్ని తెలుసుకుంటాడు’’ అని మెచ్చుకున్నాడు. మరో వ్యక్తి స్పందిస్తూ, కోహ్లీ ఎప్పుడూ ఇతరులు హైలైట్ అయ్యేలా చేస్తుంటాడని, యువకుల వెనుక నిలబడే నిస్వార్థపరుడని కొనియాడారు.

Read Also- Salman Khan: బలూచిస్థాన్‌పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మొదలైన ఆసక్తికర చర్చ

బ్యాటింగ్‌లో నిరాశ

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అంచనాలు అందుకోలేకపోయాడు. పునరాగమనంలో 8 బంతుల్లో సున్నా పరుగులకే ఔటయ్యాడు. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ విషయాన్ని పక్కనపెడితే, విరాట్ కోహ్లీకి వన్డేల్లో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు నమోదు చేసిన ఏకైక క్రికెటర్ అతడే కావడం విశేషం. విరాట్ తర్వాత సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ అతి తక్కువ వన్డే మ్యాచ్‌ల్లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 268 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ పరుగులు సాధించాడు. దీంతో, సచిన్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. అంతేకాదు, ఒకే వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉంది. 2023 ప్రపంచ కప్‌లో ఏకంగా 765 పరుగులు బాదాడు. ఛేజ్ మాస్టర్‌గా పేరొందిన విరాట్‌కు ఛేజింగ్ బ్యాటింగ్ సగటు 100 కంటే ఎక్కువగానే ఉంది. కోహ్లీ వన్డేల్లో సాధించిన 50 శతకాల్లో ఎక్కువ ఛేజింగ్‌లో వచ్చినవే. ఒత్తిడిలో కూడా నిలకడగా, స్థిరంగా పరుగులు చేయగల తన సామర్థ్యాన్ని ఎన్నోసార్లు ప్రదర్శించాడు.

Read Also- Mysterious Object: విమానం గాల్లో ఉండగా సడెన్‌గా ఢీకొన్న గుర్తుతెలియని వస్తువు.. క్షణాల్లోనే..

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది