Salman Khan: దాయాది దేశం పాకిస్థాన్‌లోని రాష్ట్రాలలో బలూచిస్థాన్ ఒకటి. అయితే, ప్రత్యేక దేశంగా ఏర్పడేందుకు బలూచిస్థాన్ ప్రావిన్స్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటివరకైతే ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు, పాక్‌లో అంతర్భాగంగానే బలూచిస్థాన్ కొనసాగుతోంది. అయితే, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన ఇటీవల జరిగిన ‘జాయ్ ఫోరమ్ 2025’లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు నటులు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, మధ్యప్రాచ్యంలో (మిడిల్ ఈస్ట్ దేశాలు) పనిచేస్తున్న వివిధ దక్షిణ ఆసియా వర్గాల ప్రజల గురించి మాట్లాడాడు. అయితే, బలూచిస్థాన్, పాకిస్థాన్ వేర్వేరు అనే కోణంలో మాట్లాడడం హాట్‌టాపిక్‌గా మారింది.
సల్మాన్ ఖాన్ ఏమన్నాడంటే?
‘‘ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ (సౌదీ అరేబియాలో) రిలీజ్ చేస్తే, అది సూపర్‌హిట్ అవుతుంది. తమిళం, తెలుగు లేదా మలయాళీ సినిమా తీసినా, అది వందల కోట్ల బిజినెస్ చేస్తుంది. ఎందుకంటే, చాలామంది ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ బలూచిస్థాన్ నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినవారు ఉన్నారు, పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసుకుంటున్నారు’’ అని సల్మాన్ ఖాన్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగవైరల్‌గా మారింది. సల్మాన్ ఖాన్ ఏదో పొరపాటున అలా అనేశారా?, లేక దాని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా? అని చర్చిస్తున్నారు. కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also- Mysterious Object: విమానం గాల్లో ఉండగా సడెన్‌గా ఢీకొన్న గుర్తుతెలియని వస్తువు.. క్షణాల్లోనే..
జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ‘‘ఇది నాలుక మడతపడిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇది అద్భుతం!. సల్మాన్ ఖాన్ బలూచిస్థాన్ ప్రజలను పాకిస్థాన్ నుంచి వేరుచేశారు’’ అని క్యాప్షన్ ఇచ్చి వీడియోను షేర్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ, ‘‘సల్మాన్ ఖాన్ వ్యాఖ్య పొరపాటున వచ్చిందా, అవగాహన లేకపోవడమా, లేక ‘బలూచిస్థాన్ స్వతంత్రం’ అని ఉద్దేశపూర్వకంగా సూచిస్తున్నారా?. అది కూడా అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లు వేదికపై ఉండగా?’’ అని సందేహాలు వెలిబుచ్చాడు.
ఏదేమైనా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో బలూచిస్తాన్ హోదాపై చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు సల్మాన్ అవగాహన లేమీతో మాట్లాడాడాన్ని సూచిస్తోందని అంటున్నారు. మరికొందరేమో బలూచిస్థాన్ ప్రత్యేక గుర్తింపును ఆయన అంగీకరించినట్లుగా భావిస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు. సల్మాన్ వ్యాఖ్య బలూచిస్థాన్ ప్రత్యేక ప్రాంతీయ గుర్తింపుపై అవగాహనను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సల్మాన్ వ్యాఖ్యలపై బలూచ్ ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ దృక్పథాన్ని, ఆశను గుర్తించినట్లుగా వారు భావిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కూడా బలూచిస్థాన్ ఒక ప్రత్యేక దేశమని అంగీకరించారంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ ప్రావిన్స్‌గా గుర్తించకూడదని అంటున్నారు.
Read Also- Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ మూవీ 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
నిజానికి, పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ అతిపెద్ద ప్రావిన్స్‌గా ఉంది. ఈ ప్రాంతానికి సుదీర్ఘమైన అస్థిరత చరిత్ర కూడా ఉంది. స్వయంప్రతిపత్తి కోసం ఆకాంక్షిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం తరచుగా బలూచిస్థాన్‌లో జరుగుతున్న తిరుగుబాటుకు నిర్దిష్ట గిరిజన నాయకులే నాయకత్వం వహిస్తున్నారని ఆరోపిస్తోంది. అయితే, పాకిస్థాన్ ప్రజలతో పోల్చితే తాము చాలా విభిన్నమని, ఇతర జాతి సమూహాలమని బలూచిస్థాన్ ప్రజలు భావిస్తున్నారు.
Finally @BeingSalmanKhan acknowledged Balochistan is not Part of Pakistan ✌️❤️🙏
Salam Khan said “ People of Balochistan, Afghanistan , Pakistan & everywhere”@BDUTT #Balochistan #Baloch pic.twitter.com/TgdqrZhzr6
— Bilal Baloch (@bbfr74) October 18, 2025
