Team India Jersey: భారత క్రికెటర్లు మైదానంలో ధరించే జెర్సీపై (Team India Jersey) స్పాన్సర్ కంపెనీ లోగో కచ్చితంగా ముద్రించి ఉంటుంది. క్రికెట్ అభిమానులు అందరికీ ఇది సుపరిచితమే. అయితే, ఎలాంటి స్పాన్సర్ లోగో లేకుండానే భారత జట్టు ఆసియా కప్ 2025 బరిలో దిగబోతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఆమోదం కూడా పొందడంతో భారత్‌లో మనీ బెట్టింగ్ యాప్‌లపై నిషేధం పడింది. దీంతో, ఇన్నాళ్లూ టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరించిన ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ 11’ ఆదాయానికి భారీ గండిపడింది. దీంతో, టీమిండియాకు స్పాన్సర్ ఒప్పందాన్ని డ్రీమ్11 అర్ధాంతరంగ ఇటీవలే రద్దు చేసుకుంది.
టీమిండియాకు సరికొత్త స్పాన్సర్‌ను అన్వేషించే పనిలో ఉన్న బీసీసీఐ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఆసియా కప్ వరకు మాత్రమే కాకుండా, 2027 వరల్డ్ కప్ వరకు కూడా కొనసాగేలా దీర్ఘకాలిక స్పాన్సర్ ఒప్పందం కోసం ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఆసియా కప్ , సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈలోగానే స్పాన్సర్‌ను ఖరారు చేయడం కష్టంగా మారింది. అందుకే, ఆసియా కప్‌లో స్పాన్సర్ లేని జెర్సీలతోనే భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు.
Read Also- National Sports Day: నేడు జాతీయ క్రీడాదినోత్సవం.. ‘ధ్యాన్‌చంద్’ గొప్పతనం ఏంటో మీకు తెలుసా?
స్పాన్సర్ అన్వేషణ విషయమై ఆగస్టు 28న (గురువారం) నాడు బీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా అధ్యక్షతన అత్యవసర అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కొత్త స్పాన్సర్ ఎంపికపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. బీసీసీఐకి వీలైనంత త్వరగా స్పాన్సర్‌ను ఎంపిక చేయాలనే లక్ష్యంతో కదులుపుతున్నప్పటికీ, ఆసియా కప్‌కు ముందు ఒప్పందాన్ని ఖరారు చేసుకొన కష్టమని భావిస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
Read Also- Class 9 Girl: టాయిలెట్ అని వెళ్లి.. స్కూల్ బాత్రూమ్‌లో.. బిడ్డను కన్న 9వ తరగతి బాలిక
ఇక, డ్రీమ్11తో ఒప్పందం ముగిసిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇదివరకే అధికారిక ప్రకటన చేశారు. కొత్త స్పాన్సర్ ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు.బీసీసీఐ విధానం చాలా స్పష్టంగా ఉందని, కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనల నేపథ్యంలో, బీసీసీఐ ఇకపై డ్రీమ్11 లేదా, ఏ ఇతర ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీతో స్పాన్సర్‌షిప్ సంబంధాన్ని కొనసాగించబోదని సైకి చెప్పారు. కొత్త నిబంధనల ప్రకారం అలాంటివాటికి అవకాశం లేదన్నారు. డ్రీమ్11 విషయంలో తాత్కాలిక అవరోధం ఎదురైందని ఆయన వివరించారు. కాగా, ఆర్థిక కోణంలో చూస్తే, డ్రీమ్ 11, మై11సర్కిల్ ఈ సంస్థలు కలిపి భారత క్రికెట్ జట్టుకు, ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రూపంలో బీసీసీఐకి ఏకంగా రూ.1,000 కోట్ల ఆదాయం కల్పిస్తున్నాయి. డ్రీమ్11ను రూ. 358 కోట్ల విలువైన భారీ ఒప్పందంతో 2023-2026 మధ్యకాలంలో స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.
Read Also- Vishal Engagement: ఘనంగా విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్