Ind vs NZ 1st T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల (Ind vs NZ 1st T20) మధ్య నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో, ప్రత్యర్థి కివీస్‌కి 239 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి దుమ్ముదులిపాడు. 35 బంతులు ఎదుర్కొని 84 పరుగులు బాదాడు. ఇందులో ఏకంగా 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అభిషేక్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరిలో రింకూ సింగ్ కూడా అదరగొట్టాడు. 20 బాల్స్ ఆడి 44 పరుగులు కొట్టాడు. ఇందులో 3 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కూడా ఫర్వాలేదనిపించారు.
Read Also- Davos summit 2026: సీఎం రేవంత్ సంచలనం.. తెలంగాణలో స్టీల్ ప్లాంట్.. దావోస్‌లో గేమ్ ఛేంజింగ్ ఒప్పందం!
భారత్ బ్యాటింగ్
సంజూశాంసన్ 10, అభిషేక్ శర్మ 84, ఇషాన్ కిషన్ 8, సూర్యకుమార్ యాదవ్ 32, హార్ధిక్ పాండ్యా 25, శివమ్ దూబే 9, రింకూ సింగ్ 44 (నాటౌట్), అక్షర్ పటేల్ 5, అర్షదీప్ సింగ్ 6 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫ్ఫీ, కైల్ జెమీసన్ చెరో రెండు వికెట్లు తీశారు. క్రిస్టియాన్ క్లార్క్, ఇష్ సోదీ, మిచెల్ శాంట్నర్ తలో వికెట్ తీశారు.

