India vs South Africa: భారత్ – దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఆదివారం జరుగుతున్న మూడవ మ్యాచ్‌లో సఫారీల బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం భారత్‌కు (Team India) మేలు చేసింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించాలంటే టీమిండియా ముందు 118 పరుగుల స్వల్ప లక్ష్యం ఖరారైంది.
మార్‌క్రమ్ ఒంటరి పోరాటం
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల అద్భుతంగా రాణించారు. పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అద్భుతమైన ఆరంభాన్ని అందించగా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ దూకుడు కొనసాగించారు. మొత్తంగా అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండే వికెట్లు తీశారు. మిగిలిన రెండు వికెట్లలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీశారు.
Read Also- Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..
ఇక, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తడబడింది. పవర్ ప్లే నుంచే వరుస వికెట్లు కోల్పోయారు. ఏ దశలోనూ కోలుకున్నట్టు కనిపించలేదు. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (1), హెండ్రిక్స్ (0) ఇద్దరూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే, కెప్టెన్ మార్‌క్రమ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా భారత బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
మార్‌క్రమ్ 46 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. మిడిలార్డర్‌లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (9), బ్రెవీస్ 2, బాష్ 4 దారుణంగా విఫలయ్యారు. ఇక, డోనోవన్ ఫెరీరా 20 పరుగులు చేసి కాసేపు నిలబడే ప్రయత్నం చేశాడు.
Read Also- Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!
తుది జట్లు ఇవే
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, టన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవాన్ ఫెరీరా, మార్కో యన్సెన్, కార్బిన్ బాష్, ఎన్రిక్ నోర్ట్జే, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

