Nepal: భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి
Nepal ( Image Source: Canva)
అంతర్జాతీయం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Nepal: భారత్–నేపాల్ మధ్య ప్రయాణాలు, వ్యాపారం, డబ్బు లావాదేవీలను సులభతరం చేసే కీలక నిర్ణయానికి నేపాల్ సిద్ధమవుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత రూ.100 కంటే ఎక్కువ విలువ ఉన్న భారత కరెన్సీ నోట్లను అధికారికంగా వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు నేపాల్ రాస్త్ర బ్యాంక్ (NRB) తుది దశలో నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియలో ఉంది. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవల చేసిన నిబంధనల సవరణకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

NRB ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ మాట్లాడుతూ, “నేపాల్ గెజిట్‌లో అధికారిక నోటీసు ప్రచురించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సర్క్యులర్లు జారీ చేస్తాం. ఖచ్చితమైన తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ ప్రక్రియ తుది దశలో ఉంది” అని తెలిపారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, భారతీయ కరెన్సీపై ఉన్న దీర్ఘకాలిక ఆంక్షలకు ముగింపు పలికినట్లే అవుతుంది.

Also Read: Labour Codes: కొత్త లేబర్ కోడ్స్‌పై స్పష్టత.. పీఎఫ్ కట్ పెరుగుతుందా? టేక్-హోమ్ జీతం తగ్గుతుందన్న భయాలపై కేంద్రం క్లారిటీ

భారత ప్రభుత్వం నవంబర్ 28న విదేశీ మారక (ఎగుమతి–దిగుమతి) నిబంధనల్లో సవరణలు చేసింది. డిసెంబర్ 2, 2025న అవి అధికారికంగా గెజిట్‌లో ప్రచురితమయ్యాయి. తాజా నిబంధనల ప్రకారం, నేపాల్‌కు వెళ్లే వారు రూ. 100 వరకు ఉన్న నోట్లను ఏ మొత్తంలోనైనా తీసుకెళ్లవచ్చు. అలాగే రూ.100 కంటే ఎక్కువ విలువ గల నోట్లను గరిష్టంగా రూ.25,000 వరకు తీసుకెళ్లడానికి, తిరిగి భారత్‌కు తీసుకురావడానికి అనుమతి ఉంటుంది.

2016లో భారత్ నోట్ల రద్దు (డీమానిటైజేషన్) అనంతరం నకిలీ కరెన్సీ, భద్రతా కారణాలను చూపుతూ నేపాల్ ప్రభుత్వం అధిక విలువ గల భారత నోట్లపై కఠిన ఆంక్షలు విధించింది. దాంతో ప్రయాణికులు తక్కువ విలువ నోట్లకే పరిమితమవ్వాల్సి వచ్చేది. ఈ ఆంక్షల వల్ల అనుకోకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, నిలిపివేతలు వంటి సమస్యలు ఎదురయ్యేవి.

Also Read:  Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

ఇప్పుడు ఆంక్షలు సడలించడంతో నేపాల్‌కు భారత్ నుంచి వచ్చే వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు, వైద్య అవసరాల కోసం వెళ్లే వారు, పర్యాటకులకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా సరిహద్దు పట్టణాలు, క్యాసినోలు, పుణ్యక్షేత్ర మార్గాలపై ఆధారపడే పర్యాటక–హాస్పిటాలిటీ రంగానికి ఈ నిర్ణయం ఊపునిస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

“ఇది చాలాకాలంగా ఉన్న డిమాండ్. భారత్ సానుకూలంగా స్పందించింది,” అని పౌడెల్ తెలిపారు. “భారీ సంఖ్యలో నేపాలీయులు ఉపాధి, ఇతర అవసరాల కోసం భారత్‌కు వెళ్తుంటారు. కరెన్సీ ఆంక్షలు చాలా కాలంగా ఇబ్బందులు కలిగించాయి, ముఖ్యంగా అక్కడే సంపాదించే వలస కార్మికులకు.” మార్చి 2024లో ప్రారంభమైన క్యూఆర్ కోడ్ చెల్లింపులు పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు ఉపశమనం ఇచ్చినా, మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా నగదు అవసరం తప్పనిసరిగా ఉందని పర్యాటక రంగ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత కరెన్సీపై ఆంక్షలు ఎత్తివేయడం సరిహద్దు ఆర్థిక కార్యకలాపాలకు, ప్రజల రోజువారీ జీవితాలకు ఎంతో కీలక మార్పుగా మారనుంది.

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!