ODI captaincy Row: టీమిండియా వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి దిగ్గజ ప్లేయర్ రోహిత్ శర్మను తప్పించి, శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించడంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే, కెప్టెన్సీ మార్పు నిర్ణయం (ODI captaincy Row) ఆస్ట్రేలియా సిరీస్ కోసం జట్టు ఎంపికైన రోజున జరగలేదని, చాలా రోజులక్రితమే జరిగిపోయిందని ‘ది టెలిగ్రాఫ్’ కథనం పేర్కొంది. ఈ విషయాన్ని రోహిత్ శర్మకు కూడా తెలియజేశారని పేర్కొంది.‘‘వన్డే జట్టుకి శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్ చేయాలనే ప్రణాళిక చాలారోజుల ముందుగానే సిద్ధమైంది. టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌కు ఇంగ్లాండ్‌లో దక్కిన విజయంతో సెలెక్టర్ల నిర్ణయానికి మరింత బలం చేకూరినట్టు అయింది. ఈ ప్రణాళిక అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ కలిసి రూపొందించారు. రోహిత్‌కు ఈ విషయం ముందుగానే తెలియజేశారు. శనివారం (జట్టు ఎంపిక రోజు) కాదు. అయితే, రోహిత్ ఈ విషయాన్ని ఎలా స్వీకరించాడన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు’’ అని ‘ది టెలిగ్రాఫ్’ కథనం పేర్కొంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు కొత్త ప్లాన్ రూపొందిస్తున్నారని, తద్వారా రోహిత్ వంటి సీనియర్లు ఆ వరల్డ్‌కప్ ఆడబోయే జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమనే సందేశం ఇచ్చినట్టు అయిందని విశ్లేషించింది.
Read Also- Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ నుంచి టికెట్ రేసులో ఉన్నది వీళ్లే!
ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేలు, ఆ తర్వాత నవంబర్-డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో 3 వన్డేలు, జనవరిలో న్యూజిలాండ్‌తో మరో 3 వన్డేలు ఉంటాయని, ఈ గ్యాప్ తర్వాత సీనియర్ ప్లేయర్లు ఫామ్ నిలుపుకోవడం కష్టమేనని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. 2027 వరల్డ్ కప్ సమయానికి రోహిత్ శర్మ వయస్సు 40 ఏళ్లకు చేరుతుంది, కాబట్టి, ప్రపంచకప్ కోసం సెలెక్టర్ల ప్రణాళికలో అతడి పేరు ఉండే అవకాశమే లేదని బీసీసీఐ వర్గాలు చెప్పినట్టు ‘ది టెలిగ్రాఫ్’ కథనం పేర్కొంది. కాగా, ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు రోహిత్ శర్మ జట్టులో కొనసాగనున్నప్పటికీ, నాయకత్వ పాత్రను శుభ్‌మన్ గిల్ పోషించనున్నాడు.
Read Also- Illegal Constructions: ఓ ఎమ్మెల్యే అండతో సర్కారు భూమిలో నిర్మాణాలకు ప్లాన్!
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వన్డే జట్టు ప్రకటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కెప్టెన్ మార్పు నిర్ణయం రోహిత్‌కు ముందుగానే తెలియజేశామని అన్నాడు. అయితే, వారి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ నిర్ణయం అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి ముందే తయారు చేసిన ప్రణాళిక అని, బీసీసీఐ బోర్డు పెద్దలతో చర్చించి, వారి ఆమోదం తీసుకున్న తర్వాత గోప్యంగా అమలు చేశారని ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది.
