King100 Movie
ఎంటర్‌టైన్మెంట్

King100: కింగ్ నాగార్జున 100వ చిత్రానికి క్లాప్ పడింది.. దర్శకుడు ఎవరంటే?

King100: టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున (King Nagarjuna) కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం (King100) సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. ఆర్.ఏ. కార్తీక్ (R.A. Karthik) దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ముహూర్తం వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ‘KING100’ అనే వర్కింగ్ టైటిల్‌తో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ LLP పతాకంపై నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు సంబంధించిన క్లాప్‌బోర్డు ఫోటోలు, పూజా కార్యక్రమాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ క్లాప్ బోర్డు ప్రకారం నాగార్జున 100వ చిత్రం అధికారికంగా ప్రారంభమవడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Bigg Boss Telugu 9: డే 29 నామినేషన్స్ ట్విస్ట్ అదిరింది.. ఇమ్యూనిటీ టాస్క్‌లో రేలంగి మావయ్య!

ముహూర్తపు వేడుక హైలైట్స్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ప్రకారం, ముహూర్తం వేడుకలో నాగార్జున సంప్రదాయబద్ధంగా పట్టు కుర్తాలో, అద్భుతమైన లుక్‌తో మెరిశారు. 100వ సినిమా అనేది ఏ నటుడికైనా ఎంతో ప్రత్యేకమైన మైలురాయి అనే విషయం తెలియంది కాదు. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను యువ దర్శకుడు ఆర్.ఏ. కార్తీక్ చేతిలో పెట్టడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ‘KING 100’ చిత్రం నాగార్జున కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచేలా దర్శకుడు కార్తీక్ పకడ్బందీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకు ఎవరెవరు హాజరయ్యారనేది తెలియాల్సి ఉంది.

Also Read- Dhruva Sarja: ‘సీతా పయనం’.. ధ్రువ సర్జా పవర్ ఫుల్ ఫస్ట్ లుక్.. గెస్ట్ రోలే కానీ!

బిగ్ బాస్ హోస్ట్ నుంచి విలన్ వరకు

ప్రస్తుతం నటుడిగా, హోస్ట్‌గా నాగార్జున (Bigg Boss Host Nagarjuna) తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘కూలీ’ (Cooli)లో పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అంతకు ముందు చేసిన ‘కుబేర’ (Kubera) సినిమాతో పాటు, ‘కూలీ’ సినిమాలో ఆయన చేసిన పాత్రలతో.. దశాబ్దాలుగా హీరోగా, లవర్ బాయ్‌గా అలరించిన కింగ్.. ఇప్పుడు కొత్త తరహా పాత్రలకు సిద్ధమవుతున్నట్లుగా హింట్ ఇచ్చేశారు. మరోవైపు, బుల్లితెరపై ఆయన ‘బిగ్ బాస్’ (Bigg Boss) కార్యక్రమానికి విజయవంతంగా హోస్ట్‌గా వ్యవహరిస్తూ, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇలా విభిన్న రంగాల్లో విజయవంతంగా దూసుకుపోతున్న నాగార్జున.. ఇకపై తన 100వ చిత్ర షూటింగ్‌తో బిజీ కానున్నారు. ఈ 100వ చిత్ర దర్శకత్వం విషయంలో దర్శకులెందరో పేర్లు వినిపించిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?