IPL Auction 2026: ఐపీఎల్ వేలం-2026లో (IPL Auction 2026) ఊహించని పరిణామం చోటుచేసుకొంది. వేలం తొలి రౌండ్‌లో అమ్ముడుపోని ప్లేయర్‌గా మిగిలిపోయిన ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone), ఆఖరున నిర్వహించిన రౌండ్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఫ్రాంచైజీ ఏకంగా రూ.13 కోట్లతో అతడిని దక్కించుకుంది. అన్‌సోల్డ్ ప్లేయర్‌ను ఊహించని రీతిలో ఇంత భారీ ధరకు దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంచనాలకు అందని రీతిలో ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఇంగ్లాండ్‌కు చెందిన ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించింది.
బేస్ ప్రైస్ రూ.2 కోట్లు.. పోటీ పడ్డ ఫ్రాంచైజీలు
లియామ్ లివింగ్‌స్టోన్ రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించాడు. లివింగ్‌స్టోన్ పేరు మొదటి రౌండ్‌లో వచ్చినప్పుడు ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. ఎలాంటి స్పందన రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20 క్రికెట్‌లో పవర్ హిట్టర్‌గా, లెగ్ స్పిన్నర్‌గా అతడి సామర్థ్యం ఉన్నప్పటికీ, గత సీజన్‌లో అంచనాలను అందుకోలేకపోవడం ప్రభావం చూపినట్టుగా కనిపిస్తోంది. అయితే, రెండో రౌండ్ వేలంలో లివింగ్‌స్టోన్ పేరు చెప్పగానే ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ పోటీ పడ్డాయి. గుజరాత్ టైటాన్స్ రూ.3.2 కోట్లకు బిడ్ వేసింది, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ రూ.4.40 కోట్లకు బిడ్ వేసింది. అక్కడి నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో జట్ల మధ్య పోటీ మొదలైంది. బిడ్ వేసేందుకు లక్నో వద్ద డబ్బు పరిమితి ధాటిపోవడంతో లక్నో రేసు నుంచి తప్పుకుంది. దీంతో, రూ.13 కోట్ల భారీ ధరతో లివింగ్‌స్టోన్‌ను ఎస్ఆర్‌హెచ్ దక్కించుకుంది. ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సారథ్యంలోని బృందం అతడిని దక్కించుకోవడంతో హర్షం వ్యక్తం చేసింది. లివింగ్‌స్టోన్‌ను దక్కించుకునేందుకు ఈ బృందం పట్టుదలగా వ్యవహరించినట్టు కనిపించింది.
Read Also- Errolla Srinivas: రాష్ట్రంలో పోలీసు శాఖలో అసమర్థులకు కీలక పదవులు.. అందుకే గన్ కల్చర్..!
కాగా, గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో, మిడిల్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. ముఖ్యంగా మ్యాచ్‌లు మలుపు తిప్పే సామర్థ్యమున్న ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకోవాలని భావించింది. అందులో భాగంగానే లివింగ్‌స్టోన్‌ను భారీ ధరకు దక్కించుకుంది. ఇతడి రాకతో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్‌లో మరింత దూకుడుతో పాటు జట్టు బ్యాలెన్స్‌గా ఉండే అవకాశం ఉంది. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా కూడా లివింగ్‌స్టోన్ ఉపయోగపడతాడు. కాబట్టి, అతడు జట్టుకు పెద్ద బలంగా మారే ఛాన్స్ ఉంది.
ఎస్ఆర్‌హెచ్ కొన్న మిగతా ప్లేయర్లు వీళ్లే..
సలీల్ అరోరా – రూ.1.50 కోట్లు (వికెట్ కీపర్)
శివాంగ్ కుమార్ – రూ.30 లక్షలు (ఆల్ రౌండర్)
జాక్ ఎడ్వర్డ్స్ – రూ.3 కోట్లు (ఆల్ రౌండర్)
అమిత్ కుమార్ – రూ. 30 లక్షలు (స్పిన్నర్)
క్రైన్స్ ఫులేత్రా – రూ. 30 లక్షలు (స్పిన్నర్)
సాకిబ్ హుస్సేన్ – రూ.30 లక్షలు (పేసర్)
ఓంకార్ టార్మలే – రూ.30 లక్షలు (పేసర్)
ప్రఫుల్ హింగే – రూ.30 లక్షలు (పేసర్)
శివమ్ మావి – రూ.75 లక్షలు (పేసర్).
Read also- Boyapati Sreenu: నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి

