Tungabhadra Dam: అలంపూర్ నియోజకవర్గంలోని తుంగభద్ర డ్యామ్ క్రస్ట్ గేట్లకు మరమ్మతుల కారణంగా ప్రస్తుత రబీలో నీటి విడుదలకు బ్రేక్ పడింది. 33 గేట్లను మార్చేందుకు తుంగభద్ర బోర్డు నిర్ణయం తీసుకోవడంతో రబీ సాగుపై రైతుల ఆశలు సన్నగిల్లాయి. ఈనెల 20 వరకు మాత్రమే ఆయకట్టుకు కేటాయించిన నీటిని మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. డ్యాం సామర్థ్యం 4 టిఎంసిల నీటి నిలువ సామర్థ్యం కంటే ఎక్కువ నిలువ చేస్తే మరమ్మతులు చేయడానికి సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ఎస్. ఈ నారాయణ నాయక్(Narayana Nayak) తెలిపారు.
తాగునీటి అవసరాలకు మాత్రమే
ప్రస్తుత సంవత్సరం తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam) కు 168 టీఎంసీల మేర నీరు వచ్చిందని తెలిపారు. ఉన్న నీటిని ఈనెల 20 వరకు వినియోగించుకునేలా మూడు రాష్ట్రాల ఆయకట్టుకు కేటాయింపులు చేశామన్నారు .తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు 5.15 టీఎంసీ ఏపీలోని కర్నూల్ కేసీ కెనాల్ కు 7.92 టీఎంసీలను కేటాయించారు. ప్రతి ఏటా రబీలోనూ అలంపూర్ నియోజకవర్గంలోని 87, 500 ఎకరాలలోని వ్యవసాయ పంటలకు సాగునీరు అందేది. కానీ ప్రస్తుతం గేట్ల మరమ్మత్తుల కారణంగా పంటల సాగుకు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. సాగునీరు అందించే వీలు లేదని పంటల సాగుపై రైతులు అవగాహన కలిగి ఉండాలని వరి సాగు చేసి ఇబ్బందులు పడొద్దని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. టీబి బోర్డు నిర్ణయంతో ఆర్డీఎస్(RTS) ఆయకట్టు పొలాలు ఈ దఫా వరి సాగుకు నోచుకునే అవకాశం లేదు.
Also Read: Pawan Kalyan: ‘ఓజీ’ దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఇది వేరే లెవల్!
నిపుణుల సూచనతో..
కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ కు రూ 80 కోట్లతో 30 కొత్త రెస్ట్ గేట్లను ఏర్పాటు చేయాలని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్(Shiva Kumr), మంత్రి బోసరాజు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. బెంగళూరులో జరిగిన నీటి సలహా మండలి సమావేశంలో టీబీ డ్యాం గేట్ల పటిష్టతపై చర్చ జరిగింది. డ్యాం 19వ గేటు కొట్టుకుపోగా స్టాప్ లాక్ గేటు అమర్చారు. ఇంజనీరింగ్ నిపుణులు అన్ని గేట్లు మార్చాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల మొగ్గు
తుంగభద్ర ఆయకట్టు కింద అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించడంతో ప్రధానంగా సాగు చేసే వరి పంట సాగు వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా కూరగాయలతో పాటు మొక్కజొన్న, అలసంద, పొగాకు తదితర పంటలను సాగు చేస్తున్నారు.
Also Read: Missterious: మిస్టీరియస్ క్లైమాక్స్ అందరికీ గుర్తుండిపోతుంది.. డైరెక్టర్ మహి కోమటిరెడ్డి

