JiohotStar: టీ20 వరల్డ్ కప్‌కు ముందు అనూహ్య పరిణామం
JioHotstar (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

JiohotStar: టీ20 వరల్డ్ కప్‌కు ముందు అనూహ్య పరిణామం.. ఐసీసీ మీడియా రైట్స్ నుంచి జియోస్టార్ నిష్క్రమణ?

JiohotStar: వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల తొలి వారంలో భారత్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026 (T20 World Cup 2026) జరగనుంది. కేవలం మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న ఈ సమయంలో అనూహ్య పరిణామం జరిగింది. ఐసీసీ మీడియా హక్కుల ఒప్పందం నుంచి జియోహాట్‌స్టార్ (JiohotStar) వైదొలగాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఐసీసీకి తెలియజేసినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. తమ కాంట్రాక్ట్ గడువులో మరో రెండు సంవత్సరాలు మిగిలివున్నప్పటికీ, భారత క్రికెట్ మీడియా హక్కులను కొనసాగించలేమని జియోస్టార్ (JioStar) చెప్పినట్టుగా కథనాలు పేర్కొంటున్నాయి. భారీ ఆర్థిక నష్టాల కారణంగా ముందుగానే మీడియా హక్కుల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు కేవలం 2 నెలల ముందు జియోస్టార్ తన నిర్ణయాన్ని చెప్పడంతో ఐసీసీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనట్టు అయ్యింది. సమయం చాలా తక్కువగా ఉండడంతో కొత్త బ్రాడ్‌కాస్టర్ కోసం హడావుడిగా వెతుకులాట మొదలుపెట్టునట్టు తెలుస్తోంది.

భారీ ధరకు కొన్న జియోస్టార్

స్టార్ ఇండియా (డిస్నే స్టార్), జియో సినిమా (వయాకామ్18) ఈ రెండూ విలీనం అయ్యి జియోస్టార్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే, విలీనానికి ముందే ఐసీసీ మీడియా రైట్స్‌ను 2024-2027 కాలానికిగానూ డిస్నీ స్టార్ ఏకంగా 3 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.27 వేల కోట్లుగా ఉంటుంది. అయితే, ఈ మీడియా ఒప్పందాన్ని కొనసాగించడంతో పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టాలు వస్తున్నాయని జియోస్టార్ సంస్థ చెబుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను చవిచూశామని, అంచనా కంటే ఎక్కువ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చిందంటూ ఐసీసీకి వివరించినట్టు సమాచారం.

Read Also- Terrorists Meeting: పాకిస్థాన్‌లో భారీ మీటింగ్ పెట్టుకున్న ఉగ్రవాదులు.. టార్గెట్ ఇదేనా?. కశ్మీర్‌లోకి వచ్చేశారా?

మరోవైపు, ఐసీసీ టీవీ ప్రసార హక్కులను (సుమారు 1.5 బిలియన్ డాలర్లు) తీసుకునేందుకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ (ZEEL) సంస్థతో కుదిరిన సబ్‌-లైసెన్సింగ్ ఒప్పందం రద్దవడం కూడా జియోస్టార్‌పై భారాన్ని పెంచింది. ఈ వివాదం ప్రస్తుతం లండన్ ఆర్బిట్రేషన్ సెంటర్‌లో కొనసాగుతోంది. మరోవైపు, ఐసీసీకి చేసే పేమెంట్లు అన్ని డాలర్లలో చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూపాయి విలువ దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో చెల్లింపు విషయంలో జియోస్టార్‌కు అదనపు భారంగా మారింది. మూడేళ్లకు సుమారు 3 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకోగా.. రూపాయి విలువ క్షీణత కారణంగా 3.3 బిలియన్ డాలర్లకు భారం పెరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఐసీసీ ప్రయత్నాలు, స్పందన కరువు

టీ20 వరల్డ్ కప్ 2025కు రెండు నెలల ముందు జియోస్టార్ తన నిర్ణయాన్ని చెప్పడంతో ఐసీసీ షాక్‌కు గురయింది. అయితే, వీలైనంత త్వరగా ఈ పరిస్థితి నుంచి బయటపడాలని చూస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే 2026-29 మీడియా హక్కుల కోసం కొత్త టెండర్లు ఆహ్వానించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ హక్కుల ధర సుమారు 2.4 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.20,000 కోట్లు) నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2026-2029 వరకు ప్రతి సంవత్సరం ఒక ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్ ఉండడంతో మీడియా హక్కుల కోసం టెండర్లు వస్తాయని ఐసీసీ భావిస్తోంది. కానీ, ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఏ ప్రధాన సంస్థ కూడా ఆసక్తి చూపించడం లేదు.

ఐసీసీ ఇప్పటికే సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలను సంప్రదించినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ, ఈ సంస్థల నుంచి ఎలాంటి స్పందనా లేదని తెలిసింది. ధర ఎక్కువగా ఉండడంతో ఆ సంస్థలు అనాసక్తి చూపిస్తున్నాయి. మరి, ఈ పరిస్థితిని ఐసీసీ ఏవిధంగా చక్కదిద్దుతుందో చూడాలి.

Read Also- Stock Markets Crash: మార్కెట్లు భారీ పతనం.. ఏకంగా రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి.. దీని వెనుక కారణాలివే

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు