Terrorists Meeting: భారత్ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా బుద్ది చెప్పినా పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర సంస్థలు, వాటి నాయకుల్లో మార్పు రావడం లేదు. భారత్‌పై ముష్కరుల కుట్రలు ఆగడం లేదు. తాజాగా మరో ముష్కర ప్లాన్ చేస్తున్నట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్థాన్ మద్దతున్న ఉగ్ర సంస్థలు లష్కరే బోయిబా (Jaish e Mohammad), జైషే మహ్మద్‌లకు ( Lashkar e Taiba) చెందిన ఉగ్రవాదులు ఇటీవల భారీ మీటింగ్ ఏర్పాటు (Terrorists Meeting) చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ టార్గెట్ చేసిన బహావల్‌పూర్‌లోని జైష్ ప్రధాన ఆఫీస్‌లో ఈ సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు జాతీయ మీడియా చేతికి అందాయి.
మరో దాడికి కుట్ర!
గత నెలలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. అయితే, భారత్‌లో మరో దాడి జరిపేందుకు ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మరో ‘ఫిదాయీన్’ (ఆత్మాహుతి) దళాన్ని సిద్ధం చేస్తోందని, నిధులు సేకరిస్తోందని అనుమానంగా ఉంది. పాక్ మద్దతున్న ఉగ్రవాద కార్యకలాపాలు జమ్మూ కశ్మీర్‌లో ఆందోళనకరమైన స్థాయి పెరుగుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే గుర్తించాయి.
తాజాగా, భయంకరమైన ఈ రెండు ఉగ్రసంస్థల ముష్కరులు భేటీ కావడంతో, సమన్వయంతో దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సూచనలు వెలువడుతున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ప్రకారం, ఈ ఉగ్రవాద సంస్థలు సెప్టెంబర్ నెల నుంచి భారత్‌లోకి చొరబాట్లు పెంచాయి. అలాగే గూఢచర్యం, సరిహద్దు రవాణా పెరిగిందని, ఉగ్రవాదులకు పాకిస్థాన్‌కు చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (SSG), ఐఎస్ఐ సహాయం చేస్తున్నట్టు గుర్తించారు. లష్కరే, జైషే ఉగ్ర సంస్థలకు చెందిన బృందాలు కాశ్మీర్‌లోకి ప్రవేశించినట్టుగా అనుమానిస్తున్నారు.
Read Also- Corruption Case: డబ్బు తీసుకుని ఎఫ్‌ఐఆర్ మార్చిన సునీల్.. సీఐను సస్పెండ్ చేసిన కమిషనర్ సజ్జనార్!
ఉగ్రవాదుల మీటింగ్‌కు సంబంధించి బయటకొచ్చిన ఫోటోలలో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి కూడా ఉన్నారు. జైష్ కమాండర్లతో పాటు అతడు కనిపిస్తున్నాడు. అత్యంత ప్రమాదకరమైన ఈ రెండు ఉగ్రవాద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయనే ఇంటెలిజెన్స్ అనుమానాలు నిజమయ్యాయి. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడగా, ఏకంగా 26 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా ఉంది. ఇక, గత నవంబర్‌లో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక జైషే మహ్మద్ హస్త ఉన్నది. పాకిస్థాన్ మద్దతు ఉన్న ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన ముష్కరులు సమావేశం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Jio Annual Plans : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. సూపర్ వ్యాలిడిటీతో 2026 కొత్త ప్లాన్లు!
లాంచ్ ప్యాడ్ పునర్నిర్మాణం
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సేనలు పీవోకేలోని రావల్‌కోట్‌లో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను టార్గెట్ చేసి కూల్చివేసింది. అయితే, ఉగ్రవాదులు తిరిగి వీటిని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ టార్గెట్ చేసిన ఉగ్రవాదుల స్థావరాలలో బహావల్‌పూర్‌లో ఉన్న జైష్ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. దీనిని కూడా పునర్మిర్మాణాన్ని ఉగ్రవాదులు చేపట్టినట్టుగా భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

