Telangana Global Summit – 2025: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన సమ్మిట్ కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు, సినీ నటుడు నాగార్జున (Akkineni Nagarjuna) సమ్మిట్ లో పాల్గొన్నారు.
అంతకుముందు గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూల మాలలు వేశారు. అనంతరం సమ్మిట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాళ్ల నిర్వాహకులు వాటి సంబంధించిన ప్రత్యేకతలను సీఎంకు వివరించారు. మరోవైపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం సమ్మిట్ కు హాజరయ్యారు.
గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, హీరో అక్కినేని నాగార్జున pic.twitter.com/Y6FAQMzU3B
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2025
మరోవైపు సినీ నటుడు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ను ఫ్యూచర్ సిటీకి కూడా తీసుకొస్తామని ప్రకటించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని నాగార్జున అన్నారు. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ ను తాను చదివానన్న నాగార్జున.. చాలా అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. ఫ్యూచర్ సిటీలో ఒక ఫిలిం హబ్ ను ఏర్పాటు చేయాలని చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం- నాగార్జున
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది
ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ నేను చదివాను, చాలా అద్భుతంగా ఉంది
ఇక్కడ ఒక ఫిలిం హబ్ ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయి
అన్నపూర్ణ స్టూడియోస్… pic.twitter.com/itYwjLK78m
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2025
Also Read: Vande Mataram Debate: లోక్ సభలో వందేమాతరంపై ప్రత్యేక చర్చ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజా పాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం వైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ఆహుతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెషన్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిథులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామగ్రిని సిద్ధం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది.

