Dharamshala T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా (Dharamshala T20) ఆదివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా (India Vs South Africa) నిర్దేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో, భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యాన్ని సాధించింది. బౌలర్ల సమష్టి ప్రదర్శన, ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుకు తోడు, తిలక్ వర్మ సమయోచిత ఇన్నింగ్స్, శుభ్‌మన్ గిల్ సహకారంతో భారత్ ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది.
అద్భుత ఆరంభం.. ఆ తర్వాత స్లో బ్యాటింగ్
118 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు చక్కటి ఆరంభం లభించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తొలి బంతికే సిక్సర్ బాదాడు. వ్యక్తిగత స్కోరు 35 పరుగుల వద్ద బాష్ బౌలింగ్‌లో మార్క్‌రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ 28 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులకే ఔటయ్యాడు. అయితే, తిలక్ శర్మ ఆచితూచి జాగ్రత్తగా ఆడాడు. 34 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శివమ్ దూబే ఒక సిక్సర్, ఒక ఫోర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.
Read Aslo- Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి
మార్‌క్రమ్ ఒంటరి పోరాటం
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల అద్భుతంగా రాణించారు. పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అద్భుతమైన ఆరంభాన్ని అందించగా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ దూకుడు కొనసాగించారు. మొత్తంగా అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండే వికెట్లు తీశారు. మిగిలిన రెండు వికెట్లలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీశారు.
ఇక, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తడబడింది. పవర్ ప్లే నుంచే వరుస వికెట్లు కోల్పోయారు. ఏ దశలోనూ కోలుకున్నట్టు కనిపించలేదు. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (1), హెండ్రిక్స్ (0) ఇద్దరూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే, కెప్టెన్ మార్‌క్రమ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా భారత బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
మార్‌క్రమ్ 46 బంతులు ఎదుర్కొని 61 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. మిడిలార్డర్‌లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (9), బ్రెవీస్ 2, బాష్ 4 దారుణంగా విఫలయ్యారు. ఇక, డోనోవన్ ఫెరీరా 20 పరుగులు చేసి కాసేపు నిలబడే ప్రయత్నం చేశాడు.
Read Also- Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

