Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ..!
Congress Election Strategy (imagecredit:twitter)
Telangana News

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Congress Election Strategy: తొలి విడుత ఎన్నికల ఫలితాలు ఆశించిన లక్ష్యాన్ని దాటకపోయినా, రెండో విడుత ఎన్నికల్లో మాత్రం మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ వ్యూహానికి మరింత పదును పెట్టింది. ఈ దశలో ‘సీరియస్ పోల్ మేనేజ్‌మెంట్’ను అమలు చేస్తూ, పోలింగ్ రోజును తమకు అనుకూలంగా మలచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది. మొదటి విడుత ఫలితాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఫస్ట్ ఫేజ్ కంటే ఎక్కువ అభ్యర్థులను గెలిపించుకోవాలనే స్ట్రాటజీతో కాంగ్రెస్ దూకుడుగా ముందుకు సాగుతున్నది. ​

ఎక్కడ సమస్య వస్తే, అక్కడ పరిష్కారం

రెండో విడుతలో విజయం కోసం నిర్దిష్టమైన, పకడ్బందీ వ్యూహాలను కాంగ్రెస్ నాయకత్వం అమలు చేస్తున్నది. మొదటి విడుతలో కొన్ని చోట్ల బూత్ స్థాయిలో పర్యవేక్షణ లోపించడం వలన ఓట్ల చీలిక జరిగిందని గుర్తించారు. ఈసారి ప్రతి బూత్‌కు, క్లస్టర్‌కు పటిష్ఠమైన ‘బూత్ కమాండో’ బృందాలను నియమించారు. వీరు ఓటర్ల నమోదు, పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. కేవలం పంపిణీలకే మాత్రమే పరిమితం కాకుండా, గెలిచిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి స్థానిక సమస్యల పరిష్కారంపై ‘నిర్ణయం’ తీసుకుంటామని వ్యక్తిగత హామీలను ఇస్తున్నారు. ఇది ఓటర్లలో నమ్మకాన్ని పెంచుతున్నది. ​పార్టీ కేంద్ర నాయకత్వం స్థానిక స్థాయి నాయకత్వానికి, ముఖ్యంగా సమర్థులైన ఏజెంట్లకు, పోలింగ్ రోజున అత్యవసర నిర్ణయాలు తీసుకునేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ‘ఎక్కడ సమస్య వస్తే, అక్కడ పరిష్కారం’ అనే విధంగా ఈ వ్యూహం పని చేస్తుంది.

Also Read: Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

అర్ధరాత్రి వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ​

పోలింగ్‌కు ముందు రాత్రి జరిగే ‘సైలెంట్ పీరియడ్’ ఈసారి కాంగ్రెస్ దృష్టిలో అత్యంత కీలకంగా మారింది. ఆ సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు వ్యక్తిగత స్థాయిలో ప్రయత్నాలు చేశారు. అభ్యర్థులు, వారి ముఖ్య అనుచరులు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తమ బలమైన ప్రాంతాలలో, ప్రత్యేకించి బలహీన వర్గాల కాలనీలలో, గడప గడపకు వెళ్లి పరామర్శించారు. ఓటర్ల సమస్యలు ఆలకిస్తూ, మరుసటి రోజు తప్పకుండా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ​కుటుంబ పెద్దలు, మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని సంప్రదింపులు జరిపారు. వారి సమస్యలు, అంచనాలను తెలుసుకుని, తాము అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామనే హామీనిచ్చారు. ఇదే స్ట్రాటజీని మూడో దఫాలోనూ అమలు చేయాలనేది ప్లాన్.

​’కౌంటర్ స్ట్రాటజీ’ అమలు

ప్రత్యర్థి పార్టీలు పంపిణీ చేస్తున్న వస్తువులు, డబ్బును దృష్టిలో ఉంచుకుని, వాటి కంటే ఆకర్షణీయమైన, మరింత సమర్థవంతమైన కౌంటర్ స్ట్రాటజీలను కూడా అమలు చేస్తున్నారు. వాస్తవానికి ​మొదటి విడుత ఎన్నికల ఫలితాలు తమ అంచనాలకు తగ్గట్టుగా రాకపోవడం వలన, కాంగ్రెస్ రెండో విడుతలో కచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. తొలి దఫాలో ఎదురైన సాంకేతిక లోపాలను, ఓటింగ్ స్లిప్పుల పంపిణీలో జరిగిన తప్పిదాలను ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రతి బూత్‌లోనూ కనీసం 51 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. పకడ్బందీ పోల్ మేనేజ్‌మెంట్, వ్యక్తిగత ప్రసన్నం వ్యూహాలతో మెజార్టీ స్థానాలను దక్కించుకుని, తమ రాజకీయ బలాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి.

Also Read: Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!