Lipstick: మీ స్కిన్ టోన్‌కు పర్ఫెక్ట్ లిప్ షేడ్స్!
lipstick ( Image Source: Twitter)
లైఫ్ స్టైల్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

Lipstick: అమ్మాయిలకు అందంగా ఉండటం ఇష్టం. దాని కోసం రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిలో మేకప్‌ కూడా ఒకటి. అయితే, మేకప్ లో లిప్ స్టిక్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఒక అమ్మాయిని చూడగానే లిప్స్‌ హైలైట్ అవుతాయి. ఫేస్ మొత్తం ప్రకాశవంతంగా, ఫ్రెష్‌గా కనిపించడం లిప్ స్టిక్ వలనే సాధ్యం. అయితే, సరైన లిప్ షేడ్ ఎంచుకోవడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రతి అమ్మాయి స్కిన్ టోన్, అండర్‌టోన్, ఉపయోగించే సందర్భం వేరుగా ఉంటుంది. డే-టు-డే , ఆఫీస్, పార్టీ, ఫొటోషూట్‌ల కోసం వేర్వేరు షేడ్స్ వాడుతుంటారు. అందుకే, అమ్మాయిలు లిప్ స్టిక్ వాడేటప్పుడు తమ స్కిన్ టోన్, అండర్‌టోన్‌ను బాగా గమనించడం అత్యంత ముఖ్యం. సరైన షేడ్ వాడితే, లిప్స్ ఆకర్షణీయంగా, ఫేస్ మొత్తం హైలైట్ అవుతుంది, అలాగే ఫోటోల్లో కూడా మెరిసే లుక్ వస్తుంది.

ఫెయిర్ స్కిన్ కోసం..

ఫెయిర్ స్కిన్ ఉన్నవారికి సాఫ్ట్ పింక్, పీచ్ పింక్ వంటి లైట్ షేడ్స్ పర్ఫెక్ట్. ఇవి డే-టు-డే లుక్‌లో న్యాచురల్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో, ఫొటోషూట్‌లు, ఈవెంట్‌లు, పార్టీ లాంటి సందర్భాల్లో క్లాసిక్ రెడ్ లేదా బెర్రీ పింక్ వాడితే స్టాండౌట్ అవుతుంది. ఫ్లాష్‌లో కూడా ఈ షేడ్స్ మెరిసిపోతాయి. లిప్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

Also Read: Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

మీడియం / ఆలివ్ స్కిన్ కోసం…

మధ్యస్థ లేదా ఓలివ్ స్కిన్ ఉన్నవారికి కోరల్, రిచ్ రెడ్, బెర్రీ రెడ్ వంటి షేడ్స్ బెస్ట్. ఇవి డే-టు-డే లుక్‌లో సబ్‌టిల్‌గా ఉండటం వల్ల ముఖానికి సాఫ్ట్, ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి. ఈవెంట్ , పార్టీ కోసం రిచ్ రెడ్, బెర్రీ రెడ్ వంటి షేడ్స్ వాడితే లిప్స్ స్పష్టంగా, స్టాండౌట్ అవుతాయి. ఈ షేడ్స్ ఫేస్ హైలైట్ చేయడంలో సహాయపడతాయి అలాగే మొత్తం లుక్ స్టైలిష్‌గా కనిపిస్తుంది.

డార్క్ స్కిన్ కోసం..

డార్క్ స్కిన్ ఉన్నవారికి వైన్, డీప్ మెరూన్, చాకొలెట్ బ్రౌన్ వంటి డీప్ షేడ్స్ బెస్ట్. ఇవి ఫ్లాష్‌లో స్టాండౌట్ అవుతాయి నైట్ అవుట్స్, ఫొటోషూట్‌ల కోసం పర్ఫెక్ట్ లుక్ ఇస్తాయి. డీప్ షేడ్స్ వాడటం వల్ల లిప్స్ స్పష్టంగా కనిపించి, ఫేస్ మొత్తం హైలైట్ అవుతుంది. అలాగే, ఈ షేడ్స్ స్మోకి, రిచ్ లుక్ ఇస్తాయి.

Also Read: Labour Codes: కొత్త లేబర్ కోడ్స్‌పై స్పష్టత.. పీఎఫ్ కట్ పెరుగుతుందా? టేక్-హోమ్ జీతం తగ్గుతుందన్న భయాలపై కేంద్రం క్లారిటీ

లిప్ స్టిక్ వేసుకునేటప్పుడు వీటిని మర్చిపోకండి..

డే-టు-డే కోసం లైట్ షేడ్స్ వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈవెంట్, పార్టీ కోసం డీప్ షేడ్స్ ఉపయోగించడం ఉత్తమం. అంతే కాదు, లిప్ బామ్ లేదా ప్రైమర్ వాడితే లిప్ స్టిక్ ఎక్కువ కాలం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా స్కిన్ టోన్ ప్రకాశవంతంగా కనిపిస్తుంది, లిప్స్ లుక్ ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది, ముఖం మొత్తం హైలైట్ అవుతుంది. సరైన షేడ్ ఎంపిక, ఫేస్ హైలైట్, సందర్భానికి తగ్గ లిప్ స్టిక్ వాడటం మేకప్‌ను పూర్తి చేస్తుంది.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం