IND vs AUS 2nd T20I: మెల్ బోర్న్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించింది. భారత్ నిర్దేశించిన 126 పరుగులు లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన ఆసీస్ ప్లేయర్లు.. 5 టీ20ల సిరీస్ లో బోణి చేశారు. 3 వికెట్లతో రాణించిన ఆసీస్ పేసర్ హెజిల్ వుడ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
దూకుడుగా ఆడిన ఆసీస్
126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. తొలి నుంచి దూకుడుగా ఆడింది. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ ఏమాత్రం బెరుకులేకుండా ఆసీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడారు. దీంతో మరో 40 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లను కోల్పోయి టార్గెట్ (126/6) ను ఫినిష్ చేసింది. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ 46 (26) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హెడ్ (28), ఇంగ్లిస్ (20) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్, బుమ్రా తలో 2 వికెట్లు పడగొట్టారు.
భారత్ ఎలా ఆడిందంటే?
తొలుత టాస్ గెలిచిన టీమిండియా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన భారత ఓపెనర్లు గిల్ (5), అభిషేక్ (68) ఆరంభంలో ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. 20 పరుగుల వద్ద గిల్ ను ఔట్ చేసిన హెజిల్ వుడ్ ఆసీస్ కు శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (2), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ పటేల్ (7) కూడా ఆసీస్ పేసర్ల ధాటికి వెంట వెంటనే తమ వికెట్లను సమర్పించుకున్నారు. మిడిల్ లో హర్షిత్ రానా 35 పరుగులు చేసి వికెట్ల పతనానికి కొద్దిసేపు బ్రేకులు వేశారు. 15.2 ఓవర్ లో హర్షిత్ కూడా పెవిలియన్ చేరడంతో ఆ తర్వాత వచ్చిన శివం దూబే (4), కుల్దీప్ యాదవ్ (0), జస్ప్రిత్ బుమ్రా (0) వరుసపెట్టి తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. దీంతో భారత జట్టు 125 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
Also Read: Pregnancy Job: గర్భవతిని చేస్తే రూ.25 లక్షలు ఇస్తా.. యువతి ఓపెన్ ఆఫర్.. తర్వాత ఏమైందంటే?
ఆసీస్ బౌలింగ్..
ఆసీస్ బౌలర్ల విషయానికి వస్తే.. హెజిల్ వుడ్ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. గ్జేవియర్ బ్రెట్ లెట్, నాథన్ ఎల్లిస్ సైతం తలో రెండు వికెట్లు పడగొట్టి రాణించారు. ఆసీస్ ఆల్ రౌండర్ స్టోయినిస్ కు ఒక వికెట్ దక్కింది. కాగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్.. వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న భారత జట్టు.. 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				