PCB: ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దాయాది దేశంపై టీమిండియా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మ్యాచ్‌లో ప్లేయర్ల ప్రదర్శన, గణాంకాల విషయం పక్కనపెడితే, మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత ప్లేయర్లు ‘హ్యాండ్ షేక్’ ఇవ్వకపోవడం వివాదాస్పదంగా మారింది. మైదానంలో ఆ ఘటన ముగిసిపోయి రోజులు గడుస్తున్నా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాత్రం ఆ విషయాన్నే పట్టుకొని వేలాడుతోంది. దీంతో, ఆ ఘటనకు సంబంధించిన వేడి ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై పాక్ తీవ్ర అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ నేపథ్యంలో హ్యాండ్‌షేక్ వివాదం సరికొత్త మలుపు తిరిగింది.
సూర్యపై ఫిర్యాదుకు రెడీ!
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పీసీబీ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ‘‘పాక్‌పై సాధించిన విజయాన్ని ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్న మా సైనికులు, పహల్గామ్ ఉగ్రదాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు అంకితం చేస్తున్నాం” అంటూ సూర్య చెప్పడాన్ని పీసీబీ తప్పుబడుతోంది. ఈ తరహా వ్యాఖ్యల ద్వారా క్రీడా వేదికను రాజకీయ వేదికగా మార్చాడని అక్కసు వెళ్లగక్కుతోంది. సూర్య వ్యాఖ్యలు క్రీడా స్ఫూర్తికి, క్రీడా విలువలకు విరుద్ధంగా ఉన్నాయని పీసీబీ వర్గాలు అంటున్నాయి.
Read Also- Horror Hostle: అమ్మబాబోయ్ హాస్టల్లో దెయ్యం.. రాత్రిళ్లు వింత శబ్దాలు.. వణికిపోతున్న విద్యార్థులు!
పాకిస్థాన్ అక్కసు
కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్ తర్వాత భారత ప్లేయర్లు హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడాన్ని పాకిస్థాన్ అవమానకరంగా భావిస్తోంది. మ్యాచ్‌కు ముందు, తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు అభివాదాలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తోంది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని చెబుతోంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా ఈ వివాదంపై ఇటీవల స్పందిస్తూ, పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపైనే తన ప్రధాన అభ్యంతరమని వ్యాఖ్యానించారు. హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం కంటే ఆ విషయమే ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు.
కాగా, హ్యాండ్‌షేక్ వివాదంలో మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ కీలక పాత్ర పోషించారని, క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరించాంటూ పాకిస్థాన్ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే యూఏఈతో మ్యాచ్ ఆడబోమని బెదిరించింది. అయినప్పటికీ ఐసీసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే, ఈ విషయంలో ఇంకా ముందుకెళ్లాలని భావిస్తే, ఆదివారం లోగా ఫిర్యాదు చేయవచ్చని ఐసీసీ అధికారులు సూచించారు. దీంతో, ఎక్కడ జరిమానా పడుతుందేమోనన్న భయంతో పాకిస్థాన్ యథావిథిగా యూఏఈతో బుధవారం రాత్రి మ్యాచ్ ఆడింది.
Read Also- Horror Hostle: అమ్మబాబోయ్ హాస్టల్లో దెయ్యం.. రాత్రిళ్లు వింత శబ్దాలు.. వణికిపోతున్న విద్యార్థులు!