Horror Hostle (Image Source: AI)
తెలంగాణ

Horror Hostle: అమ్మబాబోయ్ హాస్టల్లో దెయ్యం.. రాత్రిళ్లు వింత శబ్దాలు.. వణికిపోతున్న విద్యార్థులు!

Horror Hostle: సాంకేతికంగా ఈ ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కొందరు దెయ్యాలు, భూతాలు అంటూ అదే మూఢనమ్మకంలో జీవిస్తున్నారు. మనుషుల్లోని ఈ భయాలను ఆసరాగా చేసుకొని రోజుకొక దొంగ బాబా పుట్టుకొస్తుండటం ఈ సొసైటీలో చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలోని ఓ ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్లో దెయ్యం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. హాస్టల్ కు ఆనుకొని శ్మశానం ఉండటం.. ఈ ప్రచారానికి మరింత ఊతం ఇస్తోంది. రాత్రి అయితే చాలు వింత వింత శబ్దాలు వస్తున్నాయంటూ విద్యార్థులతో పాటు స్థానికులు వణికిపోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో.. 2007లో ఎస్సీ బాలుర హాస్టల్ ని ఏర్పాటు చేశారు. ఈ హాస్టల్ గ్రామానికి దూరంగా ఉంటుంది. గతంలో హాస్టల్ కి కొద్ది దూరంలోనే అంత్యక్రియలు నిర్వహించేవారు. కొద్దికాలం క్రితం హాస్టల్ సమీపంలో స్మశాన వాటికను నిర్మించారు. హాస్టల్ ప్రహారీ గోడకు కేవలం 8 మీటర్ల దూరంలోనే స్మశాన వాటిక ఉంది. అంతేకాకుండా కిటీలో నుంచీ స్మశాన వాటిక కనబడుతూ ఉంటుంది. అయితే గ్రామంలో ఎవరైనా చనిపోతే ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దీంతో గత రెండేళ్లుగా విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.

నిర్మానుష్యంగా హాస్టల్
ఇదిలా ఉంటే 6 నెలల క్రితం హాస్టల్ లో దెయ్యం తిరుగుతోందంటూ పుకార్లు మెుదలయ్యాయి. అది రోజు రోజుకు వ్యాప్తి చెందటంతో విద్యార్థుల్లో భయం తారాస్థాయికి చేరింది. అయితే హాస్టల్లో నిత్యం ఏవో శబ్దాలు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపించారు. దీంతో గతేడాది వరకూ అతి కష్టం మీద ఉన్న 12 మంది విద్యార్థులు.. హాస్టల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. తమ వస్తు సామాగ్రిని సైతం హస్టల్లోనే వదిలిపెట్టి పారిపోయారు. దీంతో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో హాస్టర్ నిర్మానుష్యంగా మారిపోయింది. విద్యార్థులను చేర్పించేందుకు వార్డెన్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దెయ్యాలు ఉన్నాయన్న ప్రచారంతో ఎవరూ రావడం లేదు.

స్థానికుల రియాక్షన్
ఈ హాస్టల్ సమీపంలో స్మశాన వాటిక ఉండటంతో విద్యార్థులు భయంతో రాలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎదో తిరుగుతుందని ప్రచారం కూడా జరుగుతుందని అంటున్నారు. ఫలితంగా రాత్రి వేళల్లో హాస్టల్ చుట్టుపక్కలకు గ్రామస్థులు కూడా వెళ్లడం లేదని పేర్కొంటున్నారు. కేవలం హాస్టల్ సిబ్బంది ఉదయం వచ్చి సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. పైగా ఈ హాస్టల్ విద్యార్థులకు సౌకర్యంగా లేదని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే ఇక్కడికి ఒక్క విద్యార్థి కూడా రాడని తేల్చేస్తున్నారు.

Also Read: Strange Heist: వీడెవడండీ బాబు.. ఇలాంటి వింత దొంగను.. ఎప్పుడూ చూసి ఉండరు!

వార్డెన్ ఏమంటున్నారంటే
ఈ హాస్టల్ పక్కన స్మశాన వాటిక ఉండటంతో విద్యార్థులు ఎవరూ ఉండటం లేదని వార్డెన్ తిరుపతి చెబుతున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను నచ్చజెప్పే ప్రయత్నం చేశామని అంటున్నారు. కానీ భయంతో రావడం లేదని తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ హాస్టళ్లో ఒక్క విద్యార్థి లేడని అంటున్నారు.

Also Read: Shocking Incident: ఇండియన్ తాత.. అమెరికా బామ్మ.. విస్తుపోయే క్రైమ్ కథా చిత్రం!

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?