Shocking Incident: పంజాబ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత్ మూలాలు ఉన్న 75 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు వచ్చిన అమెరికన్ మహిళ (71) దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన జులైలో జరిగినప్పటికీ.. తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో వారి వివరాలు నమోదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి వచ్చిన కొద్దిసేపటికే సదరు మహిళ హత్యకు గురికావడం అందరినీ షాక్ కు గురిచేసింది.
అసలేం జరిగిదంటే?
పంజాబ్ లోని లుధియానాలో ఈ అమెరికన్ మహిళ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ మూలాలు ఉన్న అమెరికా పౌరురాలు.. రూపిందర్ కౌర్ పాంధేర్ (71) యూఎస్ లో సెటిల్ అయ్యారు. అయితే ఇంగ్లాండ్ లో జీవిస్తున్న లూధియానాకు చెందిన ఎన్ఆర్ఐ చరణ్ జిత్ సింగ్ గ్రేవాల్ (75) ఆహ్వానం మేరకు ఆమె జులైలో భారత్ కు వచ్చారు. అయితే రూపిందర్ కౌర్, చరణ్ జిత్ ఒకరినొకరు ఇష్టపడినట్లు తెలుస్తోంది. అతడ్ని ఆమె పెళ్లి కూడా చేసుకోవాలని భావించినట్లు సమాచారం. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఆమె పంజాబ్ కు వచ్చినట్లు సమాచారం.
సోదరి ఫిర్యాదుతో..
అయితే ఇండియాకు వచ్చినప్పటి నుంచి రూపిందర్ కౌర్ ఫోన్ స్విచ్ అయ్యింది. దీంతో అనుమానించిన ఆమె సోదరి కమల్ కౌర్ ఖైరా.. జూలై 28న న్యూదిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయానికి సమాచారం అందించింది. వారు స్థానిక పోలీసులను దర్యాప్తు చేపట్టమని కోరారు. ఈ క్రమంలో గత వారం ఖైరా కుటుంబానికి రూపిందర్ మరణ వార్త తెలిసింది. అయితే ఈ కేసులో పోలీసులు మల్హా పట్టి గ్రామానికి చెందిన సుఖ్జీత్ సింగ్ సోనూను అరెస్టు చేశారు.
Also Read: Coin First Flip: యాటిట్యూడ్ స్టార్ నెక్ట్స్ సినిమా ఇదే.. ఫస్ట్ ఫ్లిప్ విడుదల
ప్రియుడే చంపించాడు..
సోను తన ఇంట్లోనే రూపిందర్‌ను హత్య చేసి.. శరీరాన్ని ఒక స్టోర్ రూమ్‌లో దహనం చేశానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. గ్రేవాల్ ఆదేశాల మేరకు 50 లక్షల రూపాయల వాగ్దానం కోసం సోను ఈ హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆర్థిక లాభాల కోసమే ఈ నేరం జరిగిందని పోలీసులు సైతం తెలిపారు. రూపిందర్ తన భారత్ ప్రయాణానికి ముందు భారీ మొత్తంలో డబ్బును గ్రేవాల్ ఖాతాలోకి బదిలీ చేసినట్లు సమాచారం.
Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్?
నిందితుడి కోసం గాలింపు..
లుధియానా పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సతీందర్ సింగ్ మాట్లాడుతూ.. పరారీలో ఉన్న గ్రేవాల్‌ను కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు తెలిపారు. సోను ఇచ్చిన సమాచారం ఆధారంగా బాధితురాలి ఎముకల అవశేషాలు, ఇతర సాక్ష్యాలను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.