Coin First Flip: యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Attitude Star Chandrahass) నటిస్తున్న తదుపరి చిత్ర టైటిల్‌ని ప్రకటించారు. ఈ మధ్యకాలంలో వరుస చిత్రాలతో ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా, శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా.. జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘కాయిన్’ (Coin Movie) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. చంద్రహాస్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) స్పెషల్‌గా ఈ మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌ను విడుదల చేశారు.
Also Read- Heroine: ఒక్క సినిమాలో చేసేందుకు.. ఈ నటికి రూ. 530 కోట్ల పారితోషికం.. ఎక్కడో కాదు ఇండియాలోనే!
‘కాయిన్’ చుట్టూ ఇంత కథ ఉందా?
ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. ఈ ‘కాయిన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటున్నాను. ఈటీవీ ప్రభాకర్‌తో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా? అని ఈ సినిమా కథ చెప్పినప్పుడు నిజంగా షాకయ్యా. ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమాపై అందరిలో భారీగా అంచనాలు పెరుగుతాయని నమ్మకంగా ఉన్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు. చిత్ర దర్శకుడు జైరామ్ చిటికెల మాట్లాడుతూ.. మమ్మల్ని సపోర్ట్ చేసిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది? అనే నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. మున్ముందు ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తాం. మా ఫస్ట్ ఫ్లిప్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాము. మా హీరో చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ ఫ్లిప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాము. నేను చంద్రహాస్ చేసిన ఆర్ఆర్ఆర్ కవర్ సాంగ్‌ని చూసి, అందులో అతని ఎనర్జీని చూసి ఈ కథను చెప్పడం జరిగింది. ఈ కథను నాకంటే ఎక్కువగా చంద్రహాసే నమ్మారు. నిమిషి మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్‌గా ఉండబోతుంది. సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
వారి కోసం కష్ట పడుతూనే ఉంటా..
‘‘యథార్థ సంఘటనల ఆధారంగా మా దర్శకుడు ఈ ‘కాయిన్’ సినిమాను తీస్తున్నారు. పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్‌ని మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్‌ని బేస్ చేసుకుని అద్భుతంగా కథను రెడీ చేశారు. జైరామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతారని నమ్ముతున్నాను. ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్‌ను లాంచ్ చేసిన సాయి రాజేష్ అన్నకు థాంక్స్. నిమిషి మ్యూజిక్ డైరెక్టర్‌గా పెద్ద స్థాయికి వెళ్తారు. శ్రీకాంత్ రాజా రత్నం ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత.. ఆయనకు ఈ కథపై చాలా నమ్మకం ఉంది. నాకు కథ నచ్చితే ఏ జానర్ అనేది ఆలోచించను. అన్ని రకాల చిత్రాలను చేయాలనుకుంటున్నాను. కథను, సినిమాలను పూర్తిగా నేనే ఓకే చేస్తాను. అందులో నాకు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చారు. నాన్న అప్పుడప్పుడు సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తుంటారు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్లందరి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పడానికి.. నేను ఎప్పుడూ కష్ట పడుతూనే ఉంటాను’’ అని హీరో చంద్రహాస్ తెలిపారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ నిమిషి జాకియాస్, లైన్ ప్రొడ్యూసర్ గంగాధర్ ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు