BCCI: కోచ్ గంభీర్‌‌కు మూడినట్టే.. అప్పటిలోగా మార్పు లేకుంటే వేటు
Gautham-Gambhir (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

BCCI: కోచ్ గంభీర్‌‌కు మూడినట్టే.. అప్పటిలోగా మార్పు లేకుంటే వేటు.. గడువు ఇదేనట!

BCCI: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 2-0 తేడాతో దారుణంగా ఓడిపోవడం హెడ్‌ కోచ్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌లో వరుసగా దారుణ పరాభవాలు ఎదురవుతున్న క్రమంలో సఫారీల చేతిలో ఓటమి గంభీర్‌ను తీవ్ర విమర్శలపాలు చేస్తోంది. పేలవ ప్రదర్శనకు తోడు ఇటీవల జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై కూడా బీసీసీఐ (BCCI) అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో, టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పదవీకాలం ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితికి చేరుకుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కోచ్‌గా గంభీర్ అనుసరిస్తున్న వివాదాస్పద విధానాలపై ఇప్పటికే పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం గంభీర్‌కు బీసీసీఐ మద్దతుగానే ఉన్నప్పటికీ, 2026లో స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రదర్శనను బట్టి అతడి భవితవ్యం తేలుతుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోతే, పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Read Also- Mahesh Kumar Goud: స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి లీడర్లు దొరకడం లేదు : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్!

గంభీర్ ప్రెస్‌మీటే కేంద్ర బిందువు

ఘోర పరాజయం తరువాత, గంభీర్ పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ చేసిన వ్యాఖ్యలు బీసీసీఐకి ఏమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. కోచ్‌గా తన వైఫల్యాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఓటమి బాధ్యత తీసుకోవడానికి బదులు, గతంలో విజయాలను (ఇంగ్లాండ్‌లో ఫలితాలు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్) గంభీర్ గుర్తు చేశాడు. విమర్శలు చేసేవారు మరచిపోయే వ్యక్తులంటూ అభివర్ణించాడు. జనాలు మర్చిపోయి ఉండవచ్చు, యువ జట్టుతో ఇంగ్లాండ్‌లో ఫలితాలు సాధించిన వ్యక్తిని తానేనని, చాలా త్వరగా మర్చిపోతారని తాను ఖచ్చితంగా ఊహించానని అన్నాడు. ఇక, కోల్‌కతా టెస్ట్ తర్వాత అక్కడి పిచ్‌పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మొదటి టెస్ట్‌లో పిచ్ అనూహ్యంగా మారిన తర్వాత, గంభీర్ స్పందిస్తూ, కావాల్సిన పిచ్ ఇదేనని, క్యూరేటర్ తాము చెప్పినట్టుగా సిద్ధం చేశారని అన్నాడు. ఓటమికి బాధ్యత వహించకుండా వాదించే ప్రయత్నంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు బీసీసీఐకి ఏమాత్రం నచ్చలేదని, ఇది అనవసరమైన వివాదానికి ఆజ్యం పోసినట్టు అయ్యిందని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. కోచ్ ఈ విధంగా బహిరంగంగా పిచ్‌లపై, లేదా మ్యాచ్ పరిస్థితులపై అంతగా వ్యాఖ్యానించడం సరైనది కాదని భావిస్తోంది.

Read Also- Bhagyashri Borse: సినిమా ప్రమోషనా? ప్రీ వెడ్డింగ్ షూటా?.. భాగ్యశ్రీ షేర్ చేసిన ఫొటోపై నెటిజన్ల కామెంట్స్ వైరల్!

ఇప్పటికే దుమ్మెత్తి పోస్టున్న జనాలు

గంభీర్‌పై టీమిండియా ఫ్యాన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే సమయంలో గంభీర్ ప్రవర్తన కూడా బీసీసీఐకి రుచించడం లేదని, కాబట్టి కోచ్‌పై సమాలోచనలు చేయడానికి ఎక్కువ సమయం లేదని భావిస్తున్నట్టుగా సమాచారం. గంభీర్‌కు బీసీసీఐ పెద్దల మద్దతును కోల్పోవడానికి ఎంతో సమయం పట్టదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 2026 వరకు భారత్ స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడదు. ఈ మేరకు షెడ్యూల్ ఏమీ లేదు. కాబట్టి, టెస్ట్ ఫార్మాట్ నుంచి కోచ్‌ను ఇప్పుడే తొలగించే అవకాశం లేదని తెలుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గంభీర్ పర్యవేక్షణలో జట్టు సాధించిన విజయాల కారణంగా బీసీసీఐ అతడిపై ఇంకా విశ్వాసంతో ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా విజయాన్ని సాధించి, ఆ ధోరణిని కొనసాగిస్తే తప్ప, పదవికి ఎసరు తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!