DK Shivakumar: సీఎం సిద్ధూ సమక్షంలోనే డీకే అసంతృప్తి
Siddu-Vs-DK (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

DK Shivakumar: సోనియానే అధికారాన్ని త్యజించారు.. సీఎం సిద్ధూ సమక్షంలోనే డీకే అసంతృప్తి.. ముదిరిన పోరు

DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌ దిగ్గజాలు సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ (DK Shivakumar) మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరిపోయింది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిపోవడంతో, తదుపరి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు డీకే శివకుమార్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అంతర్గత పోరు తీవ్రమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలోనే డీకే శివకుమార్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ సిద్ధూకి చురకలు అంటించారు.

2004లో సోనియా గాంధీ కూడా అధికారాన్ని త్యాగం చేశారంటూ డీకే శివకుమార్ గుర్తు చేశారు. అధికారం చేపట్టే అవకాశం దక్కినా, ప్రధానమంత్రి పదవికి మన్మోహన్ సింగ్ పేరును సోనియా గాంధీయే స్వయంగా ప్రతిపాదించారని గుర్తుచేశారు. సోనియా గాంధీ కాంగ్రెస్ తరపున ఈ దేశానికి సుమారుగా 20 ఏళ్లకుపైగా నాయకురాలిగా వ్యవహరించారని, కానీ, ఆమె అధికారాన్ని త్యాగం చేశారని అన్నారు. సోనియా గాంధీ ఈ దేశ ప్రధాని కావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కోరుకున్నారని, కానీ ఆమె అధికారాన్ని త్యాగం చేసి, ప్రధాని పదవికి మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారని అన్నారు. ఆర్థిక నిపుణుడైన మన్మోహన్ సింగ్‌ను ప్రభుత్వాధినేతగా ఎంచుకున్నారని పేర్కొన్నారు.

Read Also- Kolipaka Srinivas: చెక్ డ్యామ్ ధ్వంసంపై కాంగ్రెస్ వైఖరి దారుణం : కొలిపాక శ్రీనివాస్ ఫైర్!

ప్రభుత్వానికి నిరంతరం ప్రజల మద్దతు ఉండాలని కోరుకుంటున్నానని, సిద్ధరామయ్య నేతృత్వంలోని పరిపాలన కొనసాగడానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నానంటూ శివకుమార్ తన ప్రసంగాన్ని ముగించడం కొస మెరపు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతున్న క్రమంలో, సీఎం సిద్ధరామయ్య పక్కనే కూర్చున్న సమయంలో డీకే శివకుమార్ ఈ ప్రస్తావన తీసుకురావడం మరింత ఆసక్తికరంగా మారింది. ‘‘మీ దీవెనలు మాపై ఉండాలి. మీ ఆశీస్సులు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉండాలి. కాంగ్రెస్ మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తుంది’’ అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యక్రమం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Read Also- Mahesh Kumar Goud: డాక్టర్స్ సెల్ కు కొత్త కమిటీలను ఏర్పాటు.. టీపీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్ ఉత్తర్వులు!

హైకమాండ్ భేటీకి ముందు రోజే..

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం కీలక సమావేశం ఏర్పాటు చేసి, ఈ వ్యవహారంపై చర్చించబోతున్నారని తెలుస్తోంది. ఆ భేటీకి సరిగ్గా ఒక్కరోజు ముందే డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Just In

01

RTC Officer Died: ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డి పాడె మోసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Naini Coal Block: బొగ్గు బ్లాక్ టెండర్లపై ఆరోపణల వేళ.. మాజీ మంత్రి హరీష్ రావు హాట్ హాట్ కామెంట్స్

Anasuya Bharadwaj: హత్యాచారం చేసిన వారికి మరణశిక్ష బిల్‌.. అనసూయ షాకింగ్ పోస్ట్!

Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. బయటపడ్డ బండారం.. ఫొటో ఇదిగో

Political News: ఇవి బురద రాజకీయాలు.. వైసీపీ, బీఆర్ఎస్‌లపై టీడీపీ ఎంపీ ఫైర్