Jubilee Hills bypoll ( image credit: swetcha reporter)
Politics, లేటెస్ట్ న్యూస్

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు.. 42 టేబుళ్ల పై 10 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు

Jubilee Hills bypoll:  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ను నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల విభాగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 11న జరిగిన పోలింగ్ లో భాగంగా నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1 వెయ్యి 365 మంది ఓటర్లుండగా వీరిలో మొత్తం లక్షా 94 వేల 631 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకోగా, వీరిలో పురుషులు 99 వేల 771 మంది కాగా, మహిళలు 94 వేల 855 మంది కాగా, థర్ట్ జెండర్ కు చెందిన 30 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో 11న జరిగిన పోలింగ్ లో సుమారు 48.49 శాతం ఓట్లు పోలైనట్లు కూడా వెల్లడించారు.

Also Read: Jubilee Hills By election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై తాజా అప్‌డేట్ ఇదే!

ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు

డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ ను ఏర్పాటు చేసిన యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోనే ఈ నెల 14న ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల విభాగం ఏర్పాట్లు చేస్తుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ఎలక్షన్ స్టాఫ్ కు శిక్షణ కూడా నిర్వహించారు. మొత్తం పోలైన లక్షా 94 వేల 632 ఓట్లను పది రౌండ్లుగా 42 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియను నిర్వహించనున్నారు. ఒక్కో టేబుల్ కు ముగ్గురు సిబ్బందిని నియమించారు. వీరిలో ఒకరు టేబుల్ సూపర్ వైజర్, మరొకరు అసిస్టెంట్ టేబుల్ సూపర్ వైజర్ కాగా, మరోకరు సహాయక సిబ్బందిని నియమించారు.

కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓపెన్

పోలింగ్ స్టేషన్ల నెంబర్ 1 నుంచి 407 వరకు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంలను అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చే్యనున్నారు. ఎన్నికల విభాగం అధికారులు అంచనాలను తారు మారు చేస్తూ తక్కువ పోలింగ్ శాతం నమోదు కావటంతో శుక్రవారం మధ్యాహ్నాం మూడింటి కల్లా తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. పోలింగ్ స్టేషన్ల ఆవరణలో అమలు చేసిన వంద మీటర్ల ఆంక్షను శుక్రవారం కౌంటింగ్ సందర్భంగా కూడా అమల్లో ఉంటుందని ఎలక్షన్ వింగ్ అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ సెంటర్ లో పటిష్టమైన భద్రతతో పాటు సీసీ టీవీ కెమెరాలు , సాయుధ బలగాలతో మధ్య కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోనీ స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి ఈవీఎంలను టేబుల్స్ పైగా తీసుకువచ్చి లెక్కించేందుకు కావల్సిన స్థాయిలో కౌంటింగ్ స్టాఫ్ ను నియమించినట్లు తెలిసింది.

రౌండ్ల వారీగా ఫలితాలు

ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఔట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొత్తం 10 రౌండ్లుగా కొనసాగించనున్నారు. ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది ఉండగా, నోటా తో కలిపి మొత్తం 59 మందికి పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ కు సంబంధించి 58 అభ్యర్ధులు, నోటాకు పోలైన ఓట్ల సంఖ్యను వెల్లడించనున్నారు. కానీ ప్రధాన పోటీ అధికార, విపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉండే అవకాశమున్నట్లు పోలింగ్ సరళిని బట్టి అంచనా వేయవచ్చు.

Also ReadJubileeHills ByPoll Schedule: జూబ్లీహిల్స్ బైపోల్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది

Just In

01

Jubilee Hills By poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో హస్తంలో పెరిగిన కాన్ఫిడెన్స్.. కాంగ్రెస్ వ్యూహాలకు చిత్తవుతున్న బీఆర్ఎస్

Delhi Blast: మరో వీడియో విడుదల.. క్షణాల్లో చెల్లాచెదురైన కారు.. సీసీటీవీ ఫుటేజ్‌లో భయానక దృశ్యాలు

GHMC: మెడికల్ ఆఫీసర్ల అక్రమాలకు చెక్.. బల్దియాలో కీలక సంస్కరణలకు కమిషనర్ సిద్ధం

Kavitha: జాగృతితో పెట్టుకున్నోళ్లు.. ఎవరూ బాగుపడలేదు.. కవిత సంచలన కామెంట్స్!

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు.. 42 టేబుళ్ల పై 10 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు