Koppula Eshwar (imagecrdit:twitter)
Politics

Koppula Eshwar: సింగరేణి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డిమాండ్

Koppula Eshwar: సింగరేణి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉందని, సింగరేణి మనుగడను ప్రభుత్వం కాపాడాలని కోరారు. సీఎంకు తెలంగాణ(Telangana) ప్రాంతం పట్ల, సింగరేణి సంస్థపై ప్రేమ లేదని ఆరోపించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టారని, దేశవ్యాప్తంగా 1400 బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణకు నిర్ణయం తీసుకున్నారన్నారు. కార్పొరేట్ సంస్థలను కాపాడటం కోసం బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణ చేశారని మండిపడ్డారు.

బ్లాకుల వేలం పాటలో

తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికి దక్కాలని కేసీఆర్(KCR) ప్రయత్నాలు చేశారన్నారు. కానీ బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చాక 4బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణ చేశారని ఆరోపించారు. ఆ 4 బొగ్గు బ్లాకులను కాపాడటం కోసం కేసీఆర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రయత్నం చేసిందన్నారు. కేంద్రంలో బొగ్గు గనుల శాఖామంత్రి కిషన్ రెడ్డి(Kisshna Reddy), డిప్యూటీ సీఎం భట్టిబొగ్గు బ్లాకుల వేలం పాటలో కలిసి పాల్గొన్నారని, సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. గత సంవత్సరం కంటే ఎక్కువగా 35 శాతం లాభాల వాటాను కార్మికులకు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ లాభాల వాటాను 16శాతం నుంచి 32 శాతం వరకు పెంచారని, సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ను పునరుద్ధరణ చేశారన్నారు.

Also Read: Konda Surekha: అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. మంత్రి కొండా సురేఖ స్పష్టం

సింగరేణి కార్మికుల్లో భరోసా..

డిపెండెంట్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం, గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం సింగరేణి కార్మికుల్లో భరోసా నింపాలని కోరారు. నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ కక్షగట్టారని ఆరోపించారు. టీజీబీకేఎస్(TGBKS) నాయకుడు మిర్యాల రాజిరెడ్డి(Raji Reddy) మాట్లాడుతూ సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2050 వరకు థర్మల్ పవర్ వుండవద్దని కుట్ర పన్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించకపోతే కార్యాచరణప్రకటిస్తామని హెచ్చరించారు.

Also Read: Modi Manipur visit: జోరు వానలో హెలికాప్టర్ వద్దన్న భద్రతా సిబ్బంది.. మోదీ డేరింగ్ నిర్ణయం!

Just In

01

Anunay Sood death: లాస్ వేగాస్‌లో ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి..

Private Colleges: సర్కార్‌కు ప్రైవేట్ కాలేజీల హెచ్చరిక.. డబ్బు చెల్లించాలని డిమాండ్.. లేదంటే..?

AUS vs IND 4th T20I: కాసేపట్లో భారత్-ఆసీస్ నాల్గో టీ20.. ఇరు జట్లలో కీలక మార్పులు.. ఎవరు గెలుస్తారంటే?

Kaantha trailer: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా మరి..

Minister Ponguleti: బిహార్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి సంచలనం.. ఎమన్నారంటే..!