Vemula Prashanth Reddy: సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కాదు.. కాంగ్రెస్-బీజేపీ ఇన్వెస్టిగేషన్ల మారిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ జరిగిన తీరు, అసెంబ్లీలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీ సభ్యుల ప్రసంగాలను గమనిస్తే వారి బంధం బయట పడిందన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు(Harish Rao) ప్రసంగాన్ని సీఎం, మంత్రులు 33 సార్లు అడ్డుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్(BRS) పై బురద చల్లుతోందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కు అవకాశం ఇచ్చి హరీష్ రావు ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి(Revanh Reddy) ఇచ్చిన స్క్రిప్టును పాల్వాయి హరీష్ చదివారన్నారు.
లోకల్ బాడీ ఎన్నికలు
బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) బీఆర్ఎస్ ను తిడుతూ అసెంబ్లీలో మాట్లాడారన్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), బండి సంజయ్(Bandi sanjey) కలిసి పనిచేస్తున్నారని, వారి కుట్ర బయటపడిందన్నారు. సంజయ్ కు చెప్పడంతోనే కేంద్రం ఎన్.డీ.ఎస్.ఏ(NDSA) వచ్చి వారం రోజుల్లోనే రిపోర్టు ఇచ్చిందన్నారు. మోడీ ఎన్.డీ.ఎస్.ఏ ను పంపి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి సహాయం చేశారన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఉండటంతో హడావిడిగా అసెంబ్లీ పెట్టి ఘోష్ కమీషన్ రిపోర్టు అని అంటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం లో మేడిగడ్డ బ్యారేజీ అనేది చిన్న సమస్య అన్నారు. కాళేశ్వరంను సీబీఐకి ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. కేసీఆర్ ను బద్నాం చేయడం ఒక కుట్ర.. కాళేశ్వరంను ఎండబెట్టే ప్రయత్నం అన్నారు.
Also Read: Dude Movie: ప్రదీప్ రంగనాథన్, మమిత బైజుల ‘డ్యూడ్’ ఫస్ట్ గేర్ చూశారా?
బీజేపీకి అనుబంధ సంస్థ
బనకచర్ల, కావేరీ నదీ జలాల లింక్ ప్రాజెక్టును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని, అందుకే రేవంత్ రెడ్డి(Revanth Reddy), మోడీ(Modhi), చంద్రబాబు(Chandrababu) నాయుడు కలిసి కేసీఆర్(KCR) పై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణ పేరుతో పర్మినెంట్ గా మేడిగడ్డను మూసివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ బీజేపీకి అనుబంధ సంస్థ అని రేవంత్ రెడ్డి అన్నారని, 24గంటల్లో కాలేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి ఎందుకు ఇచ్చారని నిలదీశారు. చివరకు రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఒక్కటే మిగిలిందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలడంపై,రేవంత్ రెడ్డిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవస్థపై మాకు నమ్మకం
కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లపై కుట్రతో కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్న తెలంగాణ(Telangana) ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.. కేసులు మాకు కొత్త కాదు.. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉందని, ప్రజా క్షేత్రంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ వెంట పడుతూనే ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గాదరి బాలమల్లు ,మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read: Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ కోచ్ బాధ్యతల నుంచి ద్రవిడ్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదా!