BJP MP Kishan Reddy: బనకచర్ల చర్ల అంశంలో ఇద్దరు ముఖ్యమంత్రులను సమస్య పరిష్కరించుకోవాలని పిలిచామని, జడ్జి మెంట్లను ఇవ్వడానికి కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బనకచర్లపై జోక్యం చేసుకోవాలని కేంద్రానికి లేఖ రాసిందని, ఫెడరల్ స్ఫూర్తిగా ఇరు రాష్ట్రాల సీఎంలను పిలిచామని తెలిపారు. జల వివాదాల అంశంలో కలిసి చర్చించుకోవడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. కేవలం తనను విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ఎలా అని నిలదీశారు. తెలంగాణ హక్కులను కాపాడడంలో బీజేపీ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Also Read: Money Saving Tips: రూ.50 వేలతో రూ.50 లక్షలు సంపాదించే అద్భుతమైన టిప్స్.. మిస్ చేస్కోవద్దు!
(Farmers) రైతులకు యూరియా కొరత లేకుండా చూసే బాధ్యత కేంద్రానిదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్లపై అంశంపై బీఆర్ఎస్ (BRS)నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు జలాలు, ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ అపరిచితుడిలాగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటి వాటాల అంశంలో గతంలో కేసీఆర్ (KCR) వైఖరిని కిషన్ రెడ్డి చదివి వినిపించారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం బీసీ ముస్లింల పేరిట 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని, 10 శాతం పోతే బీసీలకు దక్కేది 32 శాతం మాత్రమేనని కిషన్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ విఫలం
ఇది బీసీలకు మేలు చేసినట్లా, లేక అన్యాయం చేసినట్లా అనేది ఆలోచించాలని కోరారు. మతపరమైన రిజర్వేషన్లు పక్కన పెట్టి బీసీలకే 42 శాతం ఇవ్వాలనేది తమ విధానమని స్పష్టం చేశారు. వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 65 శాతం పనులు పూర్తయ్యాయని, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పనుల పురోగతిని పరిశీలించడానికి రాబోతున్నారని తెలిపారు. నాడు వరంగల్ ఎయిర్ పోర్ట్‌కు భూసేకరణ పనులను పూర్తి చేయడంలో కేసీఆర్ (KCR) విఫలమయ్యారని కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వమైనా భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుని మాట తప్పిందని విమర్శలు చేశారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు
Also Read: Heavy Rains Hyderabad: వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం కీలక ఆదేశం!