Ram-Mohan-Naidu (Image source Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

Ram Mohan Naidu: సైన్స్ ఎక్పోజర్ టూర్‌లో భాగంగా ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లిన 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) సమావేశం అయ్యారు. ఆ విద్యార్థులకు స్వయంగా ఢిల్లీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్‌కు చెందిన పిల్లలు టూర్ విజిట్ చేస్తున్నారని, వారికంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఎక్కువ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 3 రోజులపాటు ఢిల్లీలో కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు.

Read Also- JubileeHills bypoll: జూబ్లీహిల్స్‌లో పవన్ చరిష్మా పనిచేస్తుందా?

ఢిల్లీకి వచ్చిన పిల్లలంతా మొదటిసారి విమాన ప్రయాణం చేశారని రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు. ‘‘విమాన ప్రయాణం ఉత్సాహంగా ఉంటుంది. ఢిల్లీ టూర్‌కి వచ్చిన విద్యార్థులందరూ ఇతర విద్యార్థులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి. ఢిల్లీలో చూసిన విశేషాలు అన్నింటిని ఇతర విద్యార్థులతో పంచుకోవాలి. ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ లాంటిదే. రకరకాల టెక్నాలజీలు దేశంలో వచ్చాయి. ఏం జరుగుతుందో వాటి ద్వారా సెకండ్స్‌లో తెలుసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌లో టెక్నాలజీ ఉంది. అన్నింటిలో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌‌లో గూగుల్ సంస్థ ఏఐ హబ్‌ని లక్షా 50 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఏడాదికాలంగా కంపెనీలతో చర్చించి గూగుల్ సెంటర్‌ను తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందడం కోసం ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా హౌరా విమానయాన శాఖను అభివృద్ధి చేస్తున్నారు. అతిపిన్న వయసులో నాకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా మోదీ, చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. విమానయాన రంగంలో ఇప్పటివరకు 8,43 విమానాలు ఉన్నాయి. అదనంగా మరో రెండింతలు సేవలు అందేలా చర్యలు చేపట్టాం. తెలుగువారు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్తుంటారు’’ అని రామ్మోహన్ నాయుడు గుర్తుచేసుకున్నారు.

Read Also- Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!

ఎంతో ఆనందంగా ఉంది

న్యూ ఢిల్లీలోని తన నివాసంలో ఏపీకి చెందిన 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ఆనందంగా అనిపించిందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి ముందుచూపు కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగం కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాకెట్రీ, స్పేస్ సైన్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌తో పాటు సాంస్కృతిక వారసత్వం వంటి రంగాల్లో విలువైన అవగాహన ఏర్పడుతుంది. ఈ 52 మంది విద్యార్థులకు ఇది తొలి విమానయానం కావడం విశేషం. వారితో మాట్లాడినప్పుడు ఒక చిన్న ప్రయాణం కూడా ఎంతటి పెద్ద కలలకి రెక్కలివ్వగలదో అనిపించింది. వారి ఆలోచనల్లోని స్పష్టత, మాటల్లో ధైర్యం, ముందుకు సాగాలనే పట్టుదల నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ప్రభుత్వ పాఠశాలల నుంచి వస్తున్న ఈ అసాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులను చూస్తే గర్వంగా ఉంది. ఇలాంటి అవకాశాలు వారిని వికసిత్ ఆంధ్ర – వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతాయని విశ్వసిస్తున్నాను’’ అంటూ కార్యక్రమం అనంతరం రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

Just In

01

Akhanda 2: బాలయ్య పాన్ ఇండియా ప్రచారంలో దూకుడేది.. ఇంకా అనుమానాలేనా?

Parasakthi: శ్రీలీలతో రెట్రో రొమాన్స్‌లో శివకార్తికేయన్‌.. ‘పరాశక్తి’ సాంగ్ అదిరింది

Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

Rana Daggubati: కాలాన్ని రీ క్రియేట్ చేయగలిగేది ఒక్క సినిమా మాత్రమే!

Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!