ఎంటర్‌టైన్మెంట్

Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!

Rukmini Vasanth: ఇండియన్ సినిమా హద్దుల్ని చెరిపేసి, అంతర్జాతీయ స్థాయిలో సత్తాను చాటేందుకు రాకింగ్ స్టార్ యష్ (Rocking Star Yash) ప్రస్తుతం ‘టాక్సిక్ – ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairytale for Grown-ups)తో సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. యాక్షన్-ప్యాక్డ్ డ్రామాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం 19 మార్చి, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశ‌లో ఉన్న ఈ చిత్రం.. బెంగళూరులో షూటింగ్ జరుపుకుంటోంది. రాబోయే నూతన సంవత్సరం నుంచి భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు టీమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న చిత్రాల్లో.. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ల్లో ‘టాక్సిక్’ (Toxic) ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇందులో క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read- Allu Arjun: జక్కన్న, నీల్, వంగా.. బన్నీ లైనప్ చూస్తుంటే మెంటలొచ్చేస్తుంది! ఇక తగ్గే దే లే..

బోల్డ్‌గా ఉంటూనే.. హృద్యంగా!

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్‌ నిర్వహించిన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth).. ‘టాక్సిక్’ గురించి కూడా ప్రస్థావించడం గమనించవచ్చు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం పట్ల రుక్మిణి వసంత్ ఎంతో ఉత్సాహాంగానూ, సంతోషంగానూ ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె మాటల్లో చెప్పాలంటే.. ‘టాక్సిక్’ అనేది ఇప్పటి వరకు కన్నడ లేదా భారతీయ సినిమాల్లో మనం చూసిన సినిమాలన్నింటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది రా అండ్ రస్టిక్‌గా ఎన్నో లేయర్స్‌తో ఊహకు అందని విధంగా ఉండబోతోంది. దర్శకురాలు గీతు విజన్ ఎంతో బోల్డ్‌గా ఉంటూనే.. అదే సమయంలో ఎంతో హృద్యంగానూ ఉంటుందని రుక్మిణి చెప్పిన మాటలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రమోషన్స్ కూడా మొదలై.. సినిమాకు సంబంధించి కొంత మ్యాటర్ పబ్లిక్‌లోకి వస్తే.. సినిమా భారీ హైప్ వస్తుందని చిత్ర వర్గాలు సైతం తెలుపుతున్నాయి.

Also Read- Rashmika Mandanna: నన్ను కలవాలంటే ‘రౌడీ జిమ్’కు వచ్చేయండి.. నేనే ట్రైన్ చేస్తా!

రెండు భాషల్లో చిత్రీకరణ.. నాలుగు భాషల్లో అనువాదం

కన్నడ, ఆంగ్ల భాషలలో చిత్రీకరించబడుతున్న ఈ భారీ ప్రాజెక్ట్.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో అనువాదం చేసి రిలీజ్ చేయనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రానికి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన మేకర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాతీయ అవార్డు, గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్న గీతు మోహన్‌దాస్.. మరోసారి ఈ సినిమాతో వండర్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Akhanda 2: బాలయ్య పాన్ ఇండియా ప్రచారంలో దూకుడేది.. ఇంకా అనుమానాలేనా?

Parasakthi: శ్రీలీలతో రెట్రో రొమాన్స్‌లో శివకార్తికేయన్‌.. ‘పరాశక్తి’ సాంగ్ అదిరింది

Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

Rana Daggubati: కాలాన్ని రీ క్రియేట్ చేయగలిగేది ఒక్క సినిమా మాత్రమే!

Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!