Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో రష్మిక యమా యాక్టివ్‌గా పాల్గొంటొంది. తాజాగా ఆమె విలక్షణ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ (Jayammu Nischayammu Raa With Jagapathi) టాక్ షోలో పాల్గొని, కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని తాజాగా టీమ్ విడుదల చేసింది. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో జగ్గు భాయ్, రష్మికల మధ్య జరిగిన సంభాషణ విషయానికి వస్తే..
Also Read- Bigg Boss Telugu 9: సీక్రెట్ రెబల్.. హౌస్‌లో అసలు సిసలు బిగ్ బాస్ ఆట మొదలైంది
రౌడీ జిమ్‌కు వచ్చేయండి..
‘నీ అల్లరి పనులు కొన్ని చెప్పవా.. మాకు తెలియడం లేదు’ అని జగ్గూ భాయ్ అంటే.. ‘వద్దండి.. ఇప్పుడు ఒకవేళ నేను చెప్పేశానంటే.. ఆ తర్వాత ఏసుకుంటారు’ అని రష్మిక సమాధానమిచ్చింది. ‘మీ లాస్ట్ టెక్ట్స్ ఎవరికి చేశావ్?’ అని జగపతిబాబు అంటే.. ‘దీని గురించి మనం మాట్లాడుకోవాలి’ అంటూ రష్మిక టాపిక్ డైవర్ట్ చేయగా.. ‘మాకు ఇంట్రెస్ట్ లేదు’ అని జగపతిబాబు తప్పించుకున్నారు. ‘ఎప్పుడైనా నన్ను కలవాలని అనుకుంటే మాత్రం అందరూ జిమ్‌కి వచ్చేయండి’ అని ఆడియెన్స్‌కు రష్మిక చెబుతుంది. వెంటనే జగపతిబాబు అందుకుని.. ‘జిమ్‌కి వచ్చేయండి అని అనడం తేలిక.. కానీ ఏ జిమ్, ఏ టైమ్‌లో అని చెప్పాలి కదా?’ అని ఆటపట్టించారు. హైదరాబాద్‌లో అయితే.. అని రష్మిక అనగానే.. ‘రౌడీ జిమ్ ఒకటి’ అని జగపతిబాబు కంటిన్యూ చేశారు. రష్మిక పగలబడి నవ్వారు.
Also Read- Vishwak Sen Funky: విశ్వక్ నవ్వుల తుఫాను ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
విజయ్ అని ఎవరైనా ఉన్నారా?
అయితే ఇప్పుడు నేను ‘రౌడీ జిమ్’ని స్టార్ట్ చేయాలా? అని రష్మిక అన్నారు. ఆడియెన్స్ అరుస్తుంటే.. ‘మీ అందరినీ నేనే ట్రైన్ చేస్తా’ అని వారిలో హుషారు నింపారు. ‘చాలా అందమైన పేరు నీది. దానిని అటు చేసి, ఇటు చేసి క్రష్ చేసేశారు. మీ క్రష్ ఎవరు?’ అని జగపతి బాబు ప్రశ్నించారు. వెంటనే రష్మిక ఆడియెన్స్ వైపు చూసింది. వాళ్లంతా సైలెంట్‌గా ఉన్నారు. ‘ఫిల్ ఇన్ ది బ్లాంక్స్.. మీ ఇష్టం పూర్తి చేసుకోండి..’ అని రష్మిక అన్నారు. ‘ఒకే ఒక్క బ్లాంక్ ఉంది అని.. ఒక్కళ్లే చెప్పాలంటే’ అని జగ్గూ భాయ్ అడిగితే.. ఆడియెన్స్‌ని చూస్తూ.. ‘విజయ్ అని ఎవరైనా ఉన్నారా మీలో’ అని రష్మిక అడిగారు. వెంటనే జగపతి బాబు.. ‘నేను పేరు మార్చుకుంటా.. విజయ్ జగపతి అని’ సరదాగా సమాధానం ఇచ్చారు. రష్మిక హాయిగా నవ్వుకున్నారు. ఈ షో జీ5 ఓటీటీలో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. అలాగే జీ తెలుగు ఛానల్‌లో ఈ ఆదివారం సాయంత్రం 8 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
