Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 60వ రోజు (Bigg Boss Telugu 9 Day 60) అసలు సిసలు బిగ్ బాస్ ఆట (Bigg Boss Game) మొదలైంది. ఒకరితో మరొకరికి వైరాలు పెట్టే టాస్క్‌ని బిగ్ బాస్ తీసుకున్నారు. ఇప్పటి వరకు టాస్క్ ఇదని చెప్పి బిగ్ బాస్ ఆడించేవారు. కానీ, ఇప్పుడు టాస్క్‌లో కూడా బిగ్ బాస్ భాగమవుతున్నారు. బిగ్ బాస్ ప్రత్యేకంగా ఒక కంటెస్టెంట్‌కి ఫోన్ చేసి.. నార్మల్‌గా మాట్లాడుతూ, హౌస్‌మేట్స్ మధ్య గొడవలు పెడుతున్నారు. నువ్వే రెబల్.. అని ఒక కంటెస్టెంట్‌కు చెప్పి.. ఎవరో ఒకరితో హౌస్‌లో గొడవ పెట్టుకోవాలని బిగ్ బాస్ చెప్పడం చూస్తుంటే.. అసలైన ఆట ఇప్పుడు మొదలైంది కదా.. అని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇక 60వ రోజుకు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలను బిగ్ బాస్ వదిలారు.
Also Read- Vishwak Sen Funky: విశ్వక్ నవ్వుల తుఫాను ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
మరొకరిని తొలగించే ప్రయత్నం
మొదటి ప్రోమోలో రీతూకి ఫోన్ చేసిన బిగ్ బాస్.. ఇప్పుడు నువ్వే రెబల్ అని చెప్పి.. ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఒక గేమ్ ఆడించి.. రెబల్స్ చేసే ఎలిమినేషన్ నుంచి రక్షణలా ఈ గేమ్ ఉంటుందని తెలిపారు. ఈ టాస్క్ కూడా చాలా రసవత్తరంగా ఉంది. ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ, భరణి టీమ్ గెలిచినట్లుగా బకెట్ క్లారిటీ ఇస్తుంది. ఇక రెండో ప్రోమోలో కంటెండర్ టాస్క్ నుంచి మరొకరిని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ డిమోన్ పవన్‌ను పక్కన కూర్చో బెట్టేశారు. ఇప్పుడు వచ్చిన ప్రోమో చూస్తుంటే.. మరొకరు బలి అయినట్లుగా అర్థమవుతోంది. ఈ ప్రోమోలో అసలు ఏముందంటే..
Also Read- Roja: 90స్ క్వీన్ రీ ఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత ‘సంతానం’గా రోజా!
వీడి చేతుల్లో గన్ పెట్టారు
‘మొన్న ఫస్ట్ అయితే రెబల్స్ అని అన్నారు. నిన్న రెబల్ అని అన్నారు. ఇప్పుడు ఒక్కరే ఉన్నారు.. ఆ ఒక్కరు మీరేనేమో అని అనుకుంటున్నా..’ అని సంజనతో సుమన్ శెట్టి డిస్కస్ చేస్తున్నారు. ‘ఈ టాస్క్ అట్లా ఉందన్నా’ అని సంజన చెప్పగానే ఇద్దరూ నవ్వుకుంటున్నారు. మరోవైపు భరణి, కళ్యాణ్, దివ్యల మధ్య డిస్కషన్ నడుస్తుంది. ‘ఒక రెబల్ (Secret Rebel)కి ఒక్కరిని మాత్రమే కిల్ చేసే ఛాన్స్ ఉంది. మరో ఛాన్స్ లేదు. రెబల్ మారిపోయాడు’ అని భరణి అంటుంటే.. ‘ఇప్పుడెవరయ్యారు?’ అని దివ్య ప్రశ్నించింది. ‘అదే తెలియదు’ అని భరణి అంటే.. నేనేందుకు కాకూడదు అంటూ సుమన్ శెట్టి ఓ కామెడీ లుక్‌తో అందరినీ నవ్వించారు. ‘ఫైనల్‌గా నువ్వే రెబల్ అని చెప్పవు కదా’ అని సుమన్‌ని ఇమ్ము ప్రశ్నిస్తుంటే.. ‘ప్లీజ్ నన్ను తీయవద్దు’ అని సుమన్ శెట్టి అడుక్కుంటున్నాడు. ‘నేనే నిన్ను అడుక్కుంటున్నా.. నన్ను తీయవద్దని’ అని ఇమ్ము అంటున్నారు. మరి నీ ఐడియా ప్రకారం రెబల్ ఎవరు? అని సుమన్ అంటే.. నాకు తెలిసి రాము అని అనుకుంటున్నాను.. అని ఇమ్ము అన్నారు. ‘వీడి చేతుల్లో గన్ పెట్టారు.. అందుకే వీడు ఎలా పడితే అలా కాల్చేస్తున్నాడు అందరినీ’ అని ఇమ్ము అనగానే ఆ ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత రెబల్ ఎవరో కనిపెట్టే టాస్క్ నడుస్తుంది.. ఇంటి సభ్యులు రెబల్ విషయంలో ‘గౌరవ్’ పేరు ఎక్కువ మంది చెబుతున్నారు. ఈ కంటెండర్ టాస్క్ నుంచి నెక్ట్స్ తప్పుకోబోయేది గౌరవే అనేది ఈ ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
