Ramachandra Rao: కేసీఆర్, కేటీఆర్‌పై పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్(brs) నాయకులను రక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా పెట్టుకున్నదా? అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్(Phone tapping) కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా, ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు.
పదేళ్లు బీఆర్ఎస్..
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు(Prabhakar Rao)) సహా, బీఆర్ఎస్(BRS) హయాంలో ఉన్న ముఖ్య అధికారులపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిలదీశారు. దీని వెనుక ఏదైనా ఒప్పందం దాగి ఉందా? అని అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుందని, ఇప్పుడు అదే దారిలో కాంగ్రెస్ వెళ్తోందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుని, నింద మాత్రం బీజేపీపై మోపుతోందన్నారు. కాళేశ్వరం కేసును ఏడాదిన్నర పాటు సాగదీసి.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వ్యవహరించిన కాంగ్రెస్ సర్కారు అసలు ఉద్దేశ్యం ఏంటో చెప్పాలన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీని బద్నాం చేయాలనే కుట్రలు ఇక సాగబోవన్నారు.
Also Read: MP Raghunandan Rao: జీవితంలో గెలవాలంటే క్రమశిక్షణ ముఖ్యం: ఎంపీ రఘునందన్ రావు
కాంగ్రెస్ ది విభజనాత్మక పాలిటిక్స్..
కాంగ్రెస్ విభజనాత్మక పాలిటిక్స్ చేస్తున్నదని రాంచందర్ రావు విమర్శించారు. మతాల పేరిట కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నదన్నారు. అభివృద్ధి, పాలన, ప్రజాసేవపై చర్చ చేయడానికి బదులుగా, సమాజాన్ని మతం పేరుతో విభజించి రాజకీయ లాభం పొందే ప్రయత్నంగా ఆయన చెప్పుకొచ్చారు. కేవలం 20 శాతం ముస్లింల ఓట్ల కోసం, 80 శాతం హిందువుల భావాలను నిర్లక్ష్యం చేయడం, దీనిని సెక్యులరిజం అని చెప్పడం.. ప్రజలను మోసం చేయడమేనన్నారు. మంత్రి పదవులు సైతం ఎన్నికల లాభం కోసం మత ప్రాతిపదికన పంచడం సిగ్గుచేటని విమర్శించారు. సమాజాన్ని ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో, విభజించి రాజకీయ లాభం పొందే ధోరణి కాంగ్రెస్‌కు సర్వసాధారణమైందన్నారు.
Also Read: Shiva 4K re-release: నాగార్జున చేసిన పనికి ఫిదా అయిన ఫ్యాన్స్.. ఏం చేశారంటే?
