Heavy Rains Hyderabad (image CRESDIT: TWITTER)
హైదరాబాద్

Heavy Rains Hyderabad: వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం కీలక ఆదేశం!

Heavy Rains Hyderabad: కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  ఆదేశించారు. హైదరాబాద్ (Hyderabad) లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులను అరెస్టు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సైతం అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. జీహెచ్ఎంసీ, (GHMC) హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్ , విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్దరణ కార్యక్రమాలు సైతం చేపట్టాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చూడాలన్నారు.

Also  Read: CM Revanth Reddy: పదేళ్లూ నేనే సీఎం.. కాంగ్రెస్ పార్టీదే అధికారం

భారీ వర్షాలు

ఇంకా ఒకటిరెండ్రోజుల పాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. సోమవారం సైతం పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

 Also Read: Congress Government: రేవంత్ సర్కార్ లో మహిళలకు అధిక ప్రాధాన్యత.. జహీరాబాద్ లో మహిళా శక్తి సంబరాలు

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!