Railway Projects: రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Railway Projects (imagecreedit:twitter)
జాతీయం

Railway Projects: రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. మరో 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు

Railway Projects: 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(Cabinet Committee on Economic Affairs) సమావేశమైంది. ఈ సందర్భంగా సుమారు రూ.24,634 కోట్లతో నాలుగు మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు(Railway project)లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర(Maharashtra), మధ్యప్రదేశ్(Madhya Pradesh), గుజరాత్(Gujarath), ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని 18 జిల్లాల్లో ఈ నాలుగు ప్రాజెక్టులు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను సుమారు 894 కి.మీ.ల మేర విస్తరించనున్నాయి.

కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ వైష్ణవ్..

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ వైష్ణవ్(Minister Ashwin Kumar Vaishnav) మీడియాతో మాట్లాడుతూ, పీఎం గతిశక్తి కార్యక్రమం కింద సుమారు రూ.24,634 కోట్లతో నాలుగు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి క్యాబినెట్ ఓకే చేసిందన్నారు. 2030–31 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు ప్రజలు, వస్తువులు, సేవల రవాణాను సజావుగా కనెక్టివిటీ చేస్తున్నదన్నారు.

Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కారుకు యాక్సిడెంట్.. అసలేం జరిగిందంటే?

కేంద్రం ఆమోదించిన నాలుగు ప్రాజెక్టులు ఇవే: 

వార్ధా – భుసావల్ 3వ, 4వ లైన్ – 314 కిమీ (మహారాష్ట్ర)
గోండియా డోంగర్‌ఘర్ 4వ లైన్ – 84 కి.మీ (మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్)
వడోదర – రత్లాం 3వ, 4వ లైన్ – 259 కి.మీ (గుజరాత్, మధ్యప్రదేశ్)
ఇటార్సి – భోపాల్ బినా 4వ లైన్ – 237 కి.మీ. (మధ్యప్రదేశ్)

Also Read: Nizamabad: ఆ జిల్లాలో కష్టకాలంలో.. పార్టీ జెండా మోసినవాళ్లకే జిల్లా పరిషత్

Just In

01

Vrushabha Trailer: కింగ్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ ‘వృషభ’ ట్రైలర్ వచ్చేసింది చూశారా?

Pidamarthi Ravi: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం హామీ నెరవేర్చాలి : పిడమర్తి రవి

Train Hits Elephants: రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని 8 ఏనుగులు మృతి.. ఘోర ప్రమాదం

Villages Development: పల్లెల అభివృద్ధి ఎవరి చేతుల్లో? గ్రామాభివృద్ధిపై నూతన పాలకవర్గాల ఫోకస్!

Bigg Boss9 Telugu: బిగ్ బాస్ 9 హౌస్‌లోకి ‘మిస్సమ్మ’ జోడీ.. శివాజీ, లయల సందడి మామూలుగా లేదుగా..