Israel Operation
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Israel Secret Plan: బయటపడిన ఇజ్రాయెల్ రహస్యం.. గుట్టుచప్పుడు కాకుండా..

Israel Secret Plan: తమ దేశ మనుగడకు ముప్పు తలపెట్టేందుకు అణుపరీక్షలు నిర్వహిస్తోందంటూ ఇరాన్‌పై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (Iran -Israel conflict) రెండు రోజులుగా భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌లోని అణ్వాయుధ కేంద్రాలను, ముఖ్యమైన శాస్త్రవేత్తలను, సైనిక నాయకత్వాన్ని వైమానిక దాడులతో ఇజ్రాయెల్ సేనలు ఖతం చేశాయి. సైనిక నాయకత్వాన్ని సైతం మట్టుబెట్టడంతో కనీసం ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా ఇరాన్‌కు అవకాశం లేకుండా పోయింది. ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగే అవకాశం కూడా కనిపించడం లేదు. దీనిని బట్టి గురువారం, శుక్రవారం రాత్రుళ్లో ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడులు ఎంత భీకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గురువారం రాత్రి కీలకమైన టార్గెట్లు అన్నింటినీ పూర్తి చేయగా, వరుసగా రెండవ రోజైన శుక్రవారం రాత్రి కూడా దాడులను కొనసాగించింది. అయితే, ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ (Operation Rising Lion) పేరిట జరిపిన ఈ దాడులు రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో ఏళ్లుగా పక్కాగా రూపొందించిన ప్రణాళిక.

Read this- Israeli Military: భారత్‌కు ఇజ్రాయెల్ ఆర్మీ ‘సారీ’.. ఎందుకంటే?

కొన్నేళ్ల పక్కా ప్రణాళిక
ఇరాన్‌పై ఇజ్రాయెల్ సేనలు ఇంత పకడ్బందీగా జరిపిన దాడులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను ఇజ్రాయెల్ చాలా కాలం క్రితమే టార్గెట్ చేసింది. దాడి చేసేందుకు ఎప్పటి నుంచో ఎదురుచూసింది. ఆపరేషన్‌ రైజింగ్ లయన్‌కు సంబంధించి ఐడీఎఫ్‌ అధికారి ఒకరు ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’కు చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వైమానిక దాడుల కోసం ఏకంగా ఇరాన్‌ భూభాగంలోనే ఒక డ్రోన్ స్థావరాన్ని ఇజ్రాయెల్ సేనలు గుట్టుచప్పుడు కాకుండా నిర్మించాయి. అంతేకాదు, ఖచ్చితత్వంతో దాడులు చేసేందుకు ఆయుధ వ్యవస్థలను, కమాండోలను కూడా అక్రమ మార్గంలో ఇరాన్‌లోకి తరలించారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), నిఘా సంస్థ ‘మొస్సాద్’ ఖచ్చితమైన సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టాయి.

Read this- Politician: రాబోయే 3 నెలల్లో ప్రముఖ రాజకీయ నేత మృతి.. ఇంతకీ ఎవరది?

రహస్య డ్రోన్ స్థావరం
మొస్సాద్ ఏజెంట్లు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సమీపంలో ఒక రహస్య డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేశారని ఇజ్రాయెల్ సైనిక అధికారి చెప్పారు. ఇజ్రాయెల్‌ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించే ‘ఉపరితలం నుంచి ఉపరితలం’ క్షిపణి లాంచర్‌లను కూల్చివేయడానికి ఈ స్థావరాన్ని ఉపయోగించామని, గురువారం రాత్రి దీనిని యాక్టివేట్ చేసినట్టు సదరు అధికారి వివరించారు. వాహనాల రూపురేఖల్ని పూర్తిగా మార్చివేసి వాటి ద్వారా ఆయుధ వ్యవస్థలను ఇరాన్‌లోకి అక్రమంగా రవాణా చేశామని చెప్పారు. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను న్యూట్రల్ చేయడానికి, అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా టార్గెట్లపై గురిపెట్టడానికి ఇవి ఎంతోగానో సాయపడ్డాయని వివరించారు.

Read this- Major Relief for Agri Gold Victims: అగ్రిగోల్డ్‌ స్కామ్‌ కేసులో.. కీలక పురోగతి!

కచ్చితత్వంతో దాడులు
గురు, శుక్రవారం రాత్రులు జరిపిన దాడి వీడియోలను మొస్సాద్ శనివారం విడుదల చేసింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలపై జరిపిన దాడుల దృశ్యాలను షేర్ చేసింది. రహస్య కార్యకలాపాలలో భాగంగా మొస్సాద్ కమాండోలు ‘మధ్య ఇరాన్‌’లోని యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ స్థావరాలకు అత్యంత సమీపంలో ఖచ్చితత్వంతో దాడి చేసే గైడెడ్ క్షిపణులను మోహరించి ఉండడం వీడియోల్లో కనిపించింది. ఈ వ్యూహం వినూత్నమైనదని సదరు అధికారి అభివర్ణించారు. ‘‘ఇది సరికొత్త వ్యూహం. సాహసోపేతమైన ప్రణాళిక, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అత్యున్నత స్థాయి దళాలతో ఈ దాడులు జరిపాయిం. ఇరాన్‌లో రహస్యంగా పనిచేస్తు్న్న మొస్సాద్ ఏజెంట్లు ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేశారు. ఇరాన్ నిఘా వ్యవస్థల కంటపడకుండా అద్భుతంగా పనిచేశారు’’ అని మెచ్చుకున్నారు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు