Excise department 9 image credit: swetcha reporter
హైదరాబాద్

Telangana Excise: దుమ్ము రేపుతున్న ఎక్సైజ్ పోలీసులు.. రెండు రోజుల్లో 35 లక్షల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్

Telangana Excise: స్పెషల్ డ్రైవ్ లో ఎక్సైజ్ అధికారులు దుమ్ము దులుపుతున్నారు. రెండు రోజుల్లోనే 35లక్షల రూపాయలకు పైగా విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను సీజ్ చేశారు. ఈ క్రమంలో పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను అరికట్టటానికి ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్​ ఖాసీం స్పెషల్​ డ్రైవ్ జరపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు వరకు ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఇక, డ్రైవ్ లో మొదటి రోజు వేర్వేరు చోట్ల తనిఖీలు జరిపిన ఎక్సయిజ్ బృందాలు 19లక్షలకు పైగా విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, శుక్రవారం మరో 301 బాటిళ్ల లిక్కర్ ను సీజ్ చేశారు.

Also Read: Hyderabad Police Bust: ఆన్‌లైన్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు.. 55 మొబైల్​ ఫోన్లు స్వాధీనం

73 మద్యం బాటిళ్లను స్వాధీనం

హైదరాబాద్ ఎన్​ ఫోర్స్​ మెంట్ అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరిండింటెంట్ సౌజన్య నేతృత్వంలో సీఐలు చంద్రశేఖర్ గౌడ్, మహేశ్, కోటమ్మతోపాటు ఎస్​ఐలు శ్రీనివాస్, రూప సిబ్బందితో కలిసి ఢిల్లీ, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తెలంగాణ ఎక్స్ ప్రెస్, కేఎస్​ఆర్ ఎక్స్​ ప్రెస్​ రైళ్లలో విస్తృత తనిఖీలు జరిపారు. దీంట్లో అక్రమంగా తరలిస్తున్న 73 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న శ్రీదేవి లాడ్జీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లు ఉన్నట్టుగా తెలిసి దాడి చేశారు.

55 బాటిళ్ల మద్యాన్ని సీజ్

310 నెంబర్ గది నుంచి మరో 34 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అల్ఫా హోటల్ వద్ద ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది 34 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఇక, అమీర్ పేట ఎక్సయిజ్ సీఐ పటేల్ బానోత్​ సిబ్బందితో కలిసి సంజీవరెడ్డినగర్ బస్టాప్ ప్రాంతంలో తనిఖీలు జరిపి 22 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డిలోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లను నిల్వ చేసినట్టుగా అందిన సమాచారంతో కామారెడ్డి ఎక్సయిజ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ క్రమంలో 55 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఇక, కర్ణాటక రాష్ట్రం నుంచి డిఫెన్స్ మద్యాన్ని తీసుకు వచ్చి అల్మాస్ గూడ ప్రాంతంలో అమ్ముతున్న మల్లికార్జున్​ రెడ్డి, సింగారయ్య, సుబ్బయ్య, బద్రూలను అరెస్ట్ చేసిన స్టేట్ టాస్క్ ఫోర్స్​ ఏ టీం సీఐ అంజిరెడ్డి వారి నుంచి 51 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 Also Read: Chevella Road Widening: చెట్ల పరిరక్షణ పేరుతో.. ప్రమాదకరమైన రోడ్డు స్థానికుల కష్టాలు.. ఎక్కడంటే?

Just In

01

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!