Chevella Road Widening: చేవెళ్ల ప్రజలు ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అర చేతిలో పట్టుకొని ఉండాలి. నిత్యం ఈ రోడ్డు ప్రయాణంలో ఎక్కడో ఒక చోట ప్రమాదం జరుగుతుంది. ఈ అవస్థ ఈ రోజుదీ కాదు. యేండ్లు యేండ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రోడ్డు నిర్మాణం (Chevella Road Widening) సాగడం లేదు. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎంత ట్రాఫిక్ ఉన్న ఎంజయ్గా ప్రయాణం చేస్తారు. ఈ ఔటర్ రింగ్ అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ప్రయాణం అంటే బయపడల్సిందే ఆ నరక ప్రయాణం చేసేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్కు వచ్చే నేరుగా ఉన్న ఈ మార్గం వదిలి మధ్య మార్గాలను వెతుకునే పరిస్థితి ప్రయాణికులకు వచ్చింది. మానవుడి ప్రాణాల కంటే చెట్ల ప్రాణాలే విలువైనవి అన్నట్లుగా కొంతమంది మేధావులు ట్రిబ్యునల్ ను ఆశ్రయించి స్టే తీసుకోచ్చారు. దీంతో ప్రారంభం కావాల్సిన పనులు మధ్యలేనే నిలిచిపోయాయి. ఈ కేసు పుణ్యమా అని ఇదే మార్గంలో ప్రయాణించే లారీ అదుపు తప్పి ఆలూరు గెట్ వద్ద ముగ్గురి ప్రాణాలు, మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనే కాదు ఇలా ఎన్నో ప్రమాదాలున్నాయి. ఇప్పుడైనా నాయ్యస్థానాలు మానవత్వంతో ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
నాలుగు లైన్లు 46 కిలోమీటర్లు
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రజల రహదారికి మోక్షం కలుగుతుందని ఆశిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే జాతీయ రహదారిని నాలుగు లైన్లు విస్తరించాలని అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అందులో భాగంగానే అప్పజంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నేగూడ వరకు 46 కిలోమీటర్లు దూరం రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇందుకోసం అయ్యే నిర్మాణ ఖర్చు రూ.956 కోట్ల టెండర్ వేసింది. అంతేకాకుండా ఈ రోడ్డు విస్తరణలో 135 హెక్టర్ల భూమిని రూ.200 కోట్లతో సేకరించారు. ఇంకా చేవెళ్ల బైపాస్ వద్ద కొంత భూ సేకరణ చేయాల్సి ఉంది. కానీ ఈ రోడ్డు నిర్మాణంతో స్థానికుల కండ్లల్లో ఆశలు చిగురిస్తాయనే చర్చ సాగుతుంది.
ప్రమాదాలు ప్రజలకే కాదు
చేవెళ్ల రోడ్డులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటారు. ఎన్నో మూలమలుపులు, ఎత్తు పల్లాలు ఇలా అనేక పరిస్థితులను చూస్తూ ప్రయాణించాలి. దీంతో ఎన్నో ప్రమాదాలు కండ్లు ముందే ఆ రోడ్డు పై ప్రయాణించే ప్రజాప్రతినిధులు చూస్తున్నారు. అంతేకాకుండా ఆదే ప్రజా ప్రతినిధులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. కానీ పర్యావరణ పరిరక్షణ ముందు అందరూ తలవంచుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం సైతం సమాధానం ఇవ్వాల్సిన దుస్థితి. పెట్టిన మొక్కలు పెంచడం ఒక ఎత్తు అయితే పెరిగిన చెట్లను తొలగించడం అంత సులభం కాదని గ్రీన్ ట్రిబ్యునల్ మాటలతో తెలిసింది.
చెట్టును బ్రతికించాల్సిందే
అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్లు నిర్మాణం చేసే రోడ్డులో 950 చెట్లు ఉన్నాయి. ఈ చెట్లను రక్షించి రోడ్లు వేసుకోవాలని గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు సూచించింది. ఎట్టి పరిస్థితిలో చెట్లు నరికివేసిన గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటామని కోర్టు హేచ్చరించింది. దీంతో రోడ్డు నిర్మాణానికి అడ్డుంకులు ఉండొద్దని ప్రభుత్వం చెట్లను నరికివేయకుండా పనులు చేస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా 950 చెట్ల ఉంటే 150 మర్రి చెట్లను వేర్లతో సహా తీసి మరో చోట నాటుతామని, మిగిలిన చెట్లు రోడ్డు మధ్యలోనే ఉంటాయని కోర్టుకి వివరించారు. చెట్ల పై ఉన్న కోర్టు స్టే ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు నిర్ణయంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ రోడ్డు నిర్మాణ పనులు సాగుతాయని అనుకుంటున్నారు.
Also Read: Rahul Gandhi: ఉదయం 4 గంటలకు నిద్రలేచి.. 36 సెకన్లలోనే 2 ఓట్లు డిలీట్.. రాహుల్ గాంధీ మరో బాంబ్