Student Death: మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య
Student Death (Image source Swetcha)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Student Death: మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

Student Death:

మేడ్చల్ స్వేచ్ఛ: విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన (Student Death) పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో (Crime News) సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, వికారాబాద్ జిల్లా ఎబ్బనుర్ గ్రామానికి చెందిన చాకలి మణికంఠ (19) మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మైసమ్మగూడలోని నందిని బాయ్స్ హాస్టల్ రూమ్‌లో తోటి విద్యార్థులతో కలిసి  ఉంటున్నాడు. సోమవారం కాలేజీకి వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉన్నాడు. తోటి విద్యార్థులు కాలేజీ ముగించుకొని మధ్యాహ్నం ఒంటి గంట‌ సమయంలో  రూమ్‌కు వచ్చేసరికి తలుపులు ఎంతకు తెరవకపోవడంతో చుట్టుపక్కల వాళ్లకు సమాచారం ఇచ్చారు. అంతా కలిసి తలుపులను బద్దలుకొట్టారు. అప్పటికే మణికంఠ బెడ్ షీట్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు తెలియ రాలేదు. మృతుడి తల్లి జగదాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also- Viral News: కుక్క కాటుకు చనిపోయిన గేదె.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన జనం, ఎందుకంటే?

గంజాయి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

రూ.2 లక్షల జరిమానా విధింపు

ఖమ్మం, క్రైమ్ స్వేచ్ఛ: గంజాయి కేసులో నిందుతుడికి 20 ఏండ్ల జైలు శిక్ష పడింది. రూ.2 లక్షల జరిమానా కూడా విధిస్తూ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం… 2020 ఏడాది అక్టోబర్ 8న కొణిజర్ల పోలీసులు ఆధ్వర్యంలో తనికెళ్ల గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఇన్నోవా కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో, ఆ కారును తనిఖీ చేశారు. దానిలో రూ.19 లక్షల విలువైన 130 కేజీల గంజాయిని గుర్తించారు. నిందితుడిని అదుపులో తీసుకునే విచారించగా అక్రమార్జన కోసం చింతూరు నుంచి జాహిరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తునట్లు విచారణలో వెల్లడైంది.

నిందితుడు సంగారెడ్డి జిల్లా మనియార్ గ్రామానికి చెందిన కేతావత్ ప్రవీణ్ కుమార్‌గా (25) గుర్తించి కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ 1985 చట్టం కింద కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌కు సహకరించిన విచారణ అధికారులు ఇన్స్పెక్టర్ వసంతకుమార్, ఎస్సై మొగిలి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ,జె. శరత్ కుమార్ రెడ్డి, కోర్టు హెడ్ కానిస్టేబుల్ రామారావు,కానిస్టేబుల్ మల్లికార్జున రావు, కోర్టు లైజనింగ్ కె.శ్రీకాంత్ (SI)) హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావు, శ్రీనివాస్, హోంగార్డ్ ఆఫీసర్ ఎండీ.ఆయూబ్‌లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Read Also- TS Politics: కేసీఆర్‌తో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్.. బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

Just In

01

Cyber Crime Scam: ఖాకీలకే సైబర్​ క్రిమినల్స్ ఉచ్చు… ఏం చేశారంటే?

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?

Mahabubabad News: ఎవరి మాటా వినడు.. సీతయ్యలా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి

Allu Arjun Fans: సీఎం రేవంత్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు