TS Politics: కేసీఆర్‌తో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్.. బీజేపీ ఎమ్మెల్యే ఫైర్
Alleti-Maheshwar-Reddy (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

TS Politics: కేసీఆర్‌తో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్.. బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

TS Politics: గత ప్రభుత్వ అవినీతిపై కేసులు పెడతా అన్నారు ఏమైంది?

హిల్ట్ పాలసీపై చర్చ ఎందుకు పెట్టలేదు
లక్ష కోట్ల పెట్టుబడులు ఎక్కడికి పోయాయి?: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్లుగా (TS Politics) అనుమానం ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వ అవినీతిపై కేసులు పెడతానన్నారని, మరి ఏమైందను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీడియా ముందు తొండలు జోర్రగొడతా అంటూ చెప్పి.. అసెంబ్లీలో కేసీఆర్ ముందు దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో హిల్ట్ పాలసీపై చర్చ ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. గ్లోబల్ సమ్మిట్, విదేశీ పెట్టుబడులపై చర్చించే దమ్ము, దైర్యం ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడపోయాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Read Also- POCSO Act Case: మైనర్‌పై అత్యాచారం కేసులో మేడ్చల్ కోర్టు కీలక తీర్పు

ప్రతి వర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై చర్చించే దమ్ము దైర్యం ప్రభుత్వానికి ఉందా అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి ఈ సర్కార్ కు సమయం లేదా? అని ఫైరయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేతతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని, పాలన గాడిన పడేశారన్నారు. ఇదిలా ఉండగా సభలో ఏలేటి మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మినిస్టరీ ఏర్పాటు చేయాలన్నారు. గల్ఫ్ కార్మికులు అనేక దుర్భర పరిస్థితులు ఎదురుకుంటున్నారన్నారు. మన ఊరు మనబడికి నిధులు రావడం లేదని లేవనెత్తారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదని ఏలేటి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే మంజూరు చేయాలని ఏలేటి డిమాండ్ చేశారు. వీటితో పాటుగా జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా కొన్ని డివిజన్లలో ఓటర్ల శాతంలో హెచ్చు తగ్గులు ఉన్నాయని, వాటిపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఏలేటి ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. గల్ఫ్ బాధితుల అంశం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని గల్ఫ్ భాదులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

Read Also- Coldwave Update: మరో 2-3 రోజులు ఇదే స్థాయిలో తీవ్రమైన చలి.. రిలీఫ్ ఎప్పటినుంచంటే?

కేటీఆర్ నోరు జాగ్రత్త : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కేటీఆర్ నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘాటుగా విమర్శించారు. ఉమ్మడి పాలమూరుకు బీఆర్ఎస్ నేతలు ఎవరు వస్తారో రావాలని, వారి రాజకీయాలను తన్ని తరుముతామని ఆయన హెచ్చరించారు. నాగర్ కర్నూల్ లో పర్యటనలో భాగంగా కేటీఆర్ కేవలం నోటికి పని చెప్పారని , అచ్చంపేటలో బీజేపీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే వచ్చాయని కేటీఆర్ బీజేపీని వెక్కిరిస్తున్నారని.., మరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన గుండు సున్నాపై తాము వెక్కిరించలేమా అని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎద్దేవా చేశారు. నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము 5 స్థానాల్లో మాత్రమే పోటీ చేశామని, అందులో రెండు స్థానాలు గెలిచామన్నారు. కేటీఆర్ తన వెటకారం ఆపాలని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కృష్ణా జలాలపై కేటీఆర్ కు దమ్ముంటే ప్రజా పోరాటాలు చేయాలన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం అడిగేందుకు బీఆర్ఎస్ కు సిగ్గుండాలని మండిపడ్డారు. వారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మార్పు ఉండదని, మారాల్సింది పవర్ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో బీజేపీ రెండు స్థానాలతోనే మొదలైందని, ఈరోజు 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని చురకలంటించారు. తెలంగాణను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ ను ప్రజలు నామరూపాలు లేకుండా చేయడం గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. వెక్కిలి మాటలు ఆపకుంటే కేటీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని గువ్వల హెచ్చరించారు.

Just In

01

Cyber Crime Scam: ఖాకీలకే సైబర్​ క్రిమినల్స్ ఉచ్చు… ఏం చేశారంటే?

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?

Mahabubabad News: ఎవరి మాటా వినడు.. సీతయ్యలా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి

Allu Arjun Fans: సీఎం రేవంత్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు