SP Dr P Shabarish: మహబూబాబాద్ జిల్లా నేరాల రిపోర్ట్ విడుదల
SP Dr P Shabarish (Image Source: Swetcha Reporter)
Telangana News

SP Dr P Shabarish: అల్లర్లు తగ్గాయి.. అత్యాచారాలు, హత్యలు పెరిగాయ్.. మహబూబాబాద్ క్రైమ్ రిపోర్ట్

SP Dr P Shabarish: మహబూబాబాద్ జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది అల్లర్ల శాతం చాలావరకు తగ్గిపోయాయని, అత్యాచార, కిడ్నాప్ కేసులు మాత్రం స్వల్పంగా పెరిగాయని జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరిష్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి పోలీసుల పనితీరు, అరికట్టిన నేరాల సంఖ్య, వివిధ రకాల అంశాలపై మహబూబాబాద్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 2024 తో పోలిస్తే హత్యలు పెరిగాయని, దొంగతనాల శాతం తగ్గిందని తెలిపారు. పోలీస్ స్టేషన్లో అత్యధికంగా ఆస్తి కేసులు, కుటుంబ కలహాలకు సంబంధించిన కేసులు నమోదయాయని పేర్కొన్నారు. 2025 లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై 31 మంది పై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేశామన్నారు. ఇందులో 13 మందిపై రౌడీ, 18 మందిపై సస్పెక్ట్ షీట్స్ నమోదు చేశామన్నారు.

కేసుల వివరాలు..

జిల్లాలో అత్యాచార కేసులు గతంలో 43 ఉంటే ప్రస్తుతం 56 కి పెరిగాయన్నారు. కిడ్నాప్ కేసులు గతంలో 42 ఉంటే ప్రస్తుతం 2025 చివరి నాటికి 55 కి పెరిగాయన్నారు. అల్లర్ల విషయానికి వస్తే గతంలో 50 ఉంటే ప్రస్తుతం 32 కు వచ్చాయన్నారు. హత్యలు గతేడాది 16 ఉంటే ఈ ఏడాది 22కి పెరిగాయి చెప్పారు. నేరపూరిత హత్యలు ఏడు కేసులు నమోదయాయని పేర్కొన్నారు. గతేడాది 159 దొంగతనాలు జరిగితే ఈ ఏడాది 151కి తగ్గాయని చెప్పారు. 22 హత్యలు జరిగితే ఇందులో అత్యధికంగా కుటుంబ తగాదాలు, భూమి, ఆస్తి వివాదాల నేపథ్యంలో కక్షపూరిత కారణంగా జగినట్లు పేర్కొన్నారు. 2025లో మొత్తం 56 మందిపై అత్యాచారాలు జరిగినట్టుగా ఎస్పీ పేర్కొన్నారు. 30 మందిపై అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టామన్నారు. 55 కేసులు కిడ్నాప్ కేసులు నమోదైతే అందులో 50 కేసులు మైనర్లకు సంబంధించినవి అని వెల్లడించారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేసే 42 మంది మైనర్లను నలుగురు మహిళలను రక్షించారని చెప్పారు.

ఆస్తి నేరాలు.. రోడ్డు భద్రతా చర్యలు

ఆస్తి నేరాలను అరికట్టడానికి పోలీసులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారని ఎస్పీ చెప్పారు. నివాస, వాణిజ్య ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటును ప్రోత్సహించినట్లు చెప్పారు. పాత నేరస్తులపై పూర్తి నిఘా ఉంచడంతోపాటు నిత్యం పెట్రోలింగ్ ను ముమ్మరం చేశామన్నారు. రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా వాహన రాకపోకలు పెరగడంతో రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతంలో జాగ్రత్త చర్యల బోర్డులను ఏర్పాటు చేయించామన్నారు. రహదారులపై టర్నింగ్ పాయింట్ల వద్ద ఉన్న చెట్ల పొదలను తొలగించి రూట్ మ్యాప్ లకు సంబంధించిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయించామన్నారు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు స్కూల్లో కళాశాలల వద్ద బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు.

Also Read: Women Driver Job Mela: హైదరాబాద్ మహిళలకు ఉపాధి అవకాశాలు.. సజ్జనార్ కీలక ప్రకటన

మహిళలు, చిన్నారుల సంరక్షణ..

మహబూబాబాద్ జిల్లాలో మహిళలపై వరకట్న వేధింపులు, చిన్నారులపై వేధింపుల కేసులు పెరిగాయని ఎస్పీ తెలిపారు. షీ టీమ్స్ విస్తృతంగా పనిచేసి 54 మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి 105 కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించాయన్నారు. చైల్డ్ సేఫ్టీ కోసం ఆపరేషన్ స్మైల్ ద్వారా 25 మంది, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 40 మంది పిల్లలను రక్షించి వారిని సంబంధిత సంరక్షణ కేంద్రాలకు తరలించామన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులతో నివారణ చర్యలు చేపట్టి 61 కేసులను 59 కి తగ్గించామన్నారు. 2025లో 43 కేసుల్లో దోషులకు సైబర్ నేరాల కేసుల్లో శిక్షలు విధించామన్నారు. అలాగే 821 సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే.. 212 మందికి సంబంధించిన సమస్యలను పరిష్కరించామని జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరిష్ వివరించారు.

Also Read: Hindu Family Home Fire: బంగ్లాదేశ్‌లో ఆగని ఊచకోత.. హిందువులే టార్గెట్.. ఐదు ఇళ్లకు నిప్పు

Just In

01

Jr NTR: ఢిల్లీ హైకోర్టు‌కు కృతజ్ఞతలు తెలిపిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. మ్యాటర్ ఏంటంటే?

January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్.. ముందే జాగ్రత్త పడండి మరి.. తేదీలు ఇవే

Shambhala: ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు.. ‘శంబాల’పై రెబల్ స్టార్!

Jagapathi Babu: షాకింగ్ లుక్‌లో జగపతిబాబు.. ‘పెద్ది’ పోస్టర్ వైరల్!

iPhone 16: తక్కువ ధరకే iPhone 16 కొనుగోలు చేసే ఛాన్స్