Women Driver Job Mela: హైదరాబాద్ మహిళల భద్రతతో పాటు ఆర్థిక స్వావలంబన ప్రధాన లక్ష్యాలతో తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త విధానాన్ని రూపొందించింది. హైదరాబాద్ మహిళా ప్యాసింజర్లకు భద్రత కల్పించేలా, ఇదే మహా నగరానికి చెందిన సాటి మహిళల్నే డ్రైవర్లుగా నైపుణ్యాలు నేర్పబోతోంది. ఇందుకోసం ‘ మహిళా డ్రైవర్ ఉద్యోగ మేళా’ను (Women Driver Job Mela) నిర్వహించబోతోంది. హైదరాబాద్ పోలీసుల సహకారంతో తెలంగాణ మహిళా భద్రతా విభాగం చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషన్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించారు. ‘స్టీరింగ్ పట్టండి.. స్వశక్తితో ఎదగండి’ అనే క్యాప్సన్‌తో వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
Read Also- Coldwave Update: మరో 2-3 రోజులు ఇదే స్థాయిలో తీవ్రమైన చలి.. రిలీఫ్ ఎప్పటినుంచంటే?
ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ, లైసెన్స్
డ్రైవర్ జాబ్ మేళాలో భాగంగా అర్హత గల మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడంతో పాటు లైసెన్స్ జారీలో సాయం చేయనున్నట్టు ప్రకటనలో వివరించారు. డ్రైవింగ్ అనుభవం లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, వాహన లోన్, లీజు సౌకర్యం, ఉపాధి కల్పిస్తామని తెలిపారు. 100 శాతం జాబ్ ప్లేస్‌మెంట్ ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. బైకులు, స్కూటర్లు, ఈ-ఆటో రిక్షా ట్రైనింగ్ ఉచితంగా అందిస్తామని తెలిపారు. లేడీ ట్రైనర్లు ఉంటారని, జాబ్ స్కిల్స్‌తో పాటు సేఫ్టీ ట్రైనింగ్ కూడా ఇస్తారని పేర్కొన్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లైసెన్స్ జారీ విషయంలో సాయం చేయనున్నట్టు తెలిపారు. మూడు నెలలపాటు మెంటార్‌షిప్, కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఇంతకుముందు డ్రైవింగ్ రానివాళ్లు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే లైసెన్స్ ఉన్న మహిళలైతే వెంటతీసుకొచ్చుకోవాలని సూచించారు.
అర్హతలు ఇవే
ఈ జాబ్ మేళాలో 21 నుంచి 45 ఏళ్ల మధ్య వసుసున్నవారు అర్హులు అవుతారు. అంతేకాదు, కచ్చితంగా హైదరాబాద్ వాసులై ఉండాలి. ఆధార్ కూడా తప్పనిసరిగా ఉండాలి. జాబ్ మేళాను అంబర్‌పేట్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో (PTC) నిర్వహించున్నట్టు తెలిపారు. జనవరి 3 (శుక్రవారం) జాబ్ మేళా ఉంటుందని, 89788 62299 ఫోన్ నంబర్‌ను చూచించాలని పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్ మేళా కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ సమాచారాన్ని నలుగురికీ తెలిసేలా షేర్ చేయాలంటూ సీపీ సజ్జనార్ సూచించారు.
Read Also- Khammam Police: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను విడుదల చేసిన కమీషనర్ సునీల్ దత్!

